Begin typing your search above and press return to search.

అఖిల్ 'ఏజెంట్' లో ఎవ‌రీ గాడ్?

By:  Tupaki Desk   |   16 Oct 2022 10:30 AM GMT
అఖిల్ ఏజెంట్ లో ఎవ‌రీ గాడ్?
X
అఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏకె ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకోవాల‌ని అఖిల్ భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్ హీరోల జాబితాలో చేరిపోవాల‌ని పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకోవాల‌ని అఖిల్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు.

అయితే ఈ మూవీ రిలీజ్ టైమ్ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిన‌ట్టు తెలుస్తోంది. సాక్షీ వైద్య హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క అతిథి పాత్ర‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి క‌ల్న‌ల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన అఖిల్ ఫ‌స్ట్ లుక్ , మ‌మ్ముట్టి క‌ల్న‌ల్ లుక్‌, ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

అయితే భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ మూవీ గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ చ‌ర్చినీయాంశంగా మారుతూ వ‌స్తోంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ నుంచి ఈమూవీ రిలీజ్ డేట్ మారుతూ వస్తూనే వుంది. ఫైన‌ల్ గా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేస్తారంటూ వార్త‌లు వినిపించినా చివ‌రికి సంక్రాంతి సీజ‌న్ కు కూడా రావ‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీ నుంచి స‌ర్ ప్రైజ్ స్టిల్ ని ఆదివారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. విల‌న్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తున్నామంటూ ప్రీ లుక్ ని విడుద‌ల చేశారు. ఒంటినిండా క‌వ‌ర్ చేసుకుని చేతిలో ఏకే 47 గ‌న్ తో క‌నిపిస్తున్న ఓ వ్య‌క్తి ప్రీలుక్ స్టిల్ ని విడుద‌ల చేశారు. గ‌న్ ప‌ట్టుకున్న చేతిపై `గాడ్‌` అని రాసివుంది. ఇంత‌కీ ఈ గ‌డ్ ఎవ‌రు? .. అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ పాత్ర‌లో విల‌న్ గా హ‌ర్యానా న‌టుడు విక్ర‌మ్ జీత్ విర్క్ న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లో ఇత‌ని ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

హిప్ అప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. అఖిల్ మార్కెట్ ని మించి భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.