Begin typing your search above and press return to search.

ఉస్తాద్ రామ్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   15 April 2022 8:30 AM GMT
ఉస్తాద్ రామ్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌
X
టాలీవుడ్ లో మునుపెన్న‌డూ లేనంత‌గా స్టార్ హీరోల‌కు హీరోయిన్ ల బెడ‌ద ఎదుర‌వుతోంది. గ‌తంలో ఈ స‌మ‌స్య సీనియ‌ర్ హీరోల‌కు మాత్ర‌మే ప‌రిమితం. కానీ ఇప్ప‌డది స్టార్ హీరోయిల‌కు, క్రేజీ స్టాల‌కు కూడా ఎదుర‌వుతూ వారి ప్రాజెక్ట్ లు ఆల‌స్య‌మ‌య్యేలా చేస్తోంది. దీంతో సెట్స్ పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్ లు హీరోయిన్ లు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆల‌స్యం అవుతూ వ‌స్తున్నాయి. 'అఖండ‌' సినిమా టైమ్ లో బాల‌య్య కు జోడీగా హీరోయిన్ ఫైన‌ల్ కాక‌పోవ‌డంతో ఈ మూవీ షూటింగ్ ప్ర‌ధాన ఘ‌ట్టాలు ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఇదే త‌ర‌హా ప‌రిస్థితిని క్రేజీ హీరో ఉస్తాద్ రామ్ కూడా ఎదుర్కొంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ 'రెడ్‌' త‌రువాత హీరో రామ్ న‌టిస్తున్న యాక్ష‌న్ డ్రామా 'ది వారియ‌ర్‌'. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో బై లింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. కృతిశెట్టి, అక్ష‌ర గౌడ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీలో హీరో ఆది పినిశెట్టి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస‌త్ఉన్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

రామ్ ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్న ఈ మూవీలో పాపుల‌ర్ డైరెక్ట‌ర్ భార‌తీరాజా, న‌దియా, చిరాగ్ జైన్‌, రెడిన్ కింగ్స్‌లే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 14న విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో రామ్ ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రామ్ తో ఇప్ప‌టికే 'ది వారియ‌ర్‌' మూవీని నిర్మిస్తున్న నిర్మాత శ్రీ‌నివాస చిట్టూరి ఈ మూవీని కూడా నిర్మించ‌బోతున్నారు.

రీసెంట్ గా 'అఖండ‌'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న బోయ‌పాటి శ్రీ‌ను మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్ లో వున్న ఆయ‌న రామ్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈ మూవీ ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఇందులో రామ్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న‌ని హీరోయిన్ గా మేక‌ర్స్ ఫైన‌ల్ చేసేశారు. అయితే ఇందులో మ‌రో హీరోయిన్ కూడా రామ్ తో రొమాన్స్ చేయ‌నుంద‌ట‌.

త‌న ఎంపిక కోసం ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్ ల‌ని ప‌రిశీలించిన చిత్ర బృందం ఎవ‌రూ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఈ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఆ కార‌ణంగానే ఈ మూవీ షూటింగ్ మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు వున్న‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ర‌ష్మిక మంద‌న్న ఇత‌ర ప్రాజెక్ట్ ల‌లో బిజీగా వుండ‌టం కూడా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌డానికి ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్టుగా చెబుతున్నారు.