Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాల కొత్త రిలీజ్ డేట్ లివే
By: Tupaki Desk | 29 Jan 2022 9:30 AM GMTకోవిడ్, ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త వైరస్ రాకెట్‌స్పీడుతో వ్యాపిస్తున్నా దాని వల్ల ప్రమాదం ఏమీ లేకపోవడంతో చాలా వరకు వైరస్ సోకిన వారంతా మూడు నాలుగు రోజుల్లోనే రికవర్ అవుతున్నారు. దీంతో వైరస్ భయాలు చిన్న చిన్నగా జనాల్లో తొలగిపోతున్నాయి. మారుతున్న పరిస్థితులు, తగ్గుతున్న కేసులని దృష్టిలో పెట్టుకుని చాలా మంది విశ్లేషకులు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం వుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో టాలీవుడ్ లో మళ్లీ రిలీజ్ ల సందడి ప్రారంభం కాబోతోంది. ఏపీలోనూ పరిస్థితులు మారుతుండటంతో చాలా వరకు స్టార్ లు పక్కా రిలీజ్ డేట్ లతో సినిమాలని థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే రిలీజ్ డేట్ లు మాత్రం మారబోతున్నాయి. గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్ లతో కాకుండా కొత్త డేట్ లతో రాబోతున్నాయి. కొన్ని గతంలో ప్రకటించిన డేట్ లకే రెడీ అవుతుండగా బిగ్ టికెట్ చిత్రాలు చాలా వరకు మారిన డేట్ లతో రాబోతున్నాయి.
ఈ వరుసలో ముందు రిలీజ్ అవుతున్న చిత్రాలు ఖిలాడీ, డీజే టిల్లు. ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి 11నే థియేటర్లలోకి రాబోతున్నాయి. రవితేజ `ఖిలాడీ` తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఆ తరువాత ఫిబ్రవరి 25న `భీమ్లా నాయక్` రిలీజ్ అవుతుందని ప్రకటించారు కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ మారినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుందని చెబుతున్నారు. ఈ రోజున రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న `సర్కారు వారి పాట` రిలీజ్ డేట్ మారడంతో `భీమ్లా నాయక్` ఈ డేట్ ని రిజర్వ్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు.
ఈ మూవీ రిలీజ్ అనుకున్న ఫిబ్రవరి 25న శర్వానంద్ నటిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` విడుదల కాబోతోంది. ఒక వేళ `భీమ్లా నాయక్` పాత డేట్ కే అంటే ఫిబ్రవరి 25కే వచ్చేస్తే మాత్రం శర్వానంద్ మూవీ `ఆడవాళ్లు మీకు జోహార్లు` వెనక్కి వెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది. వరుసగా ఫ్లాప్ లు పలకరిస్తుండటం, పైగా ఈ చిత్రానికి పెద్దగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కాకపోవడంతో శర్వా సేఫ్ డేట్ కు వెళ్లే అవకాశం వుందని చెబుతున్నారు.
వీటి తరువాత `ఆర్ ఆర్ ఆర్` రాబోతోంది. జనవరి 7న సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ అనూహ్యంగా పరిస్థితులు మారడం, ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరగడంతో దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేయక తప్పలేదు. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
ఇందులో ఏదో ఒక డేట్ న `ఆర్ ఆర్ ఆర్` థియేటర్లలో సందడి చేయడం ఖాయం. ఇక ప్రభాస్ `రాధేశ్యామ్` కూడా జనవరి 14న విడుదల కావాల్సింది. సేమ్ సమస్యతో ఈ మూవీని కూడ వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీని మార్చి మొదటి వారంలో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.