Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్ మీద కొత్త పుకారు.. ఫ్యాన్స్ లో టెన్షన్... ?
By: Tupaki Desk | 28 Dec 2021 4:49 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ మీద అంచనాలు అయితే అంబరాన్ని తాకేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రత్యేకించి నార్త్ ఇండియాలో ప్రభాస్ హోరు జోరు వీర లెవెల్ లో ఉంది. ప్రభాస్ సాహో తరువాత వస్తున్న రాధేశ్యామ్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అక్కడి ఫిల్మ్ ట్రేడ్ పండితులు పందేలే కడుతున్నారు.
ఈ మూవీ రిలీజ్ కి డేట్ కూడా ఫిక్స్ అయింది. జనవరి 14న గ్రాండియర్ గా వరల్డ్ వైజ్ గా మూవీ తెర ముందుకు వస్తోంది. ఈ మూవీలో ఒక యునిక్ కంటెంట్ ని టచ్ చేశారు. ప్రేమ కోసం ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే చేసే పోరాటమే సెల్యూలాయిడ్ మీద సరికొత్త ఆవిష్కరణ అంటున్నారు డైరెక్టర్ రాధాక్రిష్ణ.
మ్యూజిక్ బాగుంది, టేకింగ్ కూడా అదరహో అన్న రేంజిలో ఉండవచ్చునని టీజర్స్ చెబుతున్నాయి. అంతటా పాజిటివ్ బజ్ ఉన్న టైమ్ ఒక న్యూస్ మాత్రం పుకారు లా షికారు చేస్తోంది. అదేంటి అంటే రాధేశ్యామ్ ని ఓటీటీలో రిలీజ్ చేస్తారు అని. నిజంగా ఇది నమ్మతగిన న్యూసేనా అంటే తెలియదు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
అసలు రాధేశ్యామ్ కి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే దేశంలో, ప్రపంచమంలో ప్రస్తుతం మారిన పరిస్థితుల వల్లనే ఇలాంటి ప్రచారం వస్తోంది అంటున్నారు. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ తో జనమంతా బెంబేలెత్తుతున్నారు. మరో వైపు దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దాంతో నార్త్ ఇండియాలో ఆంక్షలు మొదలైపోయాయి.
రాత్రి పూట కర్ఫ్యూలు కూడా పెడుతున్నారు. పరిస్థితి ఇంకా సీరియస్ అనుకుంటే త్వరలోనే పగటి పూట కూడా కొత్త నిబంధలను తీసుకువచ్చే చాన్స్ ఉంది. దాంతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కి ఈ టెన్షన్ పట్టుకుందిట. నార్త్ ఇండియాలో మూవీస్ కి జనాలు వచ్చేది అంతా నైట్ షోస్ కే. ఉదయం షోలు అక్కడ ఎపుడూ పెద్దగా ఫుల్ అవవని ట్రేడ్ అనలిస్టులు చెబుతారు.
మరి కొత్త సినిమాలకు తొలి రోజుల్లోనే కలెక్షన్లు వెల్లువలా రావాలి. అలా జరగాలీ అంటే నైట్ షోస్ కంపల్సరీగా ఉండాలి. దాంతో రాధేశ్యామ్ టీమ్ ఈ విషయాన్ని సీరియస్ గానే ఆలోచిస్తోందిట. ఇక కొత్త ఏడాది కేసులు మరింతగా పెరిగి ఏమైనా సీన్ మారితే ఎలా అన్నదే వారి ఆలోచనగా ఉంది అంటున్నారు. మొత్తానికి ఓటీటీకి రాధేశ్యామ్ వెళ్ళనుంది అంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అసలు ఓటీటీ అన్న వార్త ఎలా వచ్చిందో తెలియదు కానీ అది నిజం కాకూడదని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
మా హీరో రికార్డులను తిరగరాస్తాడు. రాధేశ్యామ్ తో బాలీవుడ్ షేక్ కావడం ఖాయమని వారు అంటున్నారు. ఇవన్నీ పుకార్లుగానే చూడాలని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ట్రిపుల్ ఆర్ కి ఇదే బాధ ఉంది. అయితే ఆ మూవీ జనవరి 7న రిలీజ్ అవుతోంది. రాధేశ్యామ్ కి వచ్చేసరికి జనవరి మధ్య నెల సమీపిస్తుంది. దాంతో ఎక్కువ టెన్షన్ రాధేశ్యామ్ టీమ్ దే అంటున్నారు. చూడాలి మరి పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న రెండు మూవీస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయఢంకా మోగించాలని ప్రతీ తెలుగు సినీ అభిమానీ గట్టిగానే కోరుకుంటున్నారు.