Begin typing your search above and press return to search.
SSMB 28 సినిమాపై కొత్త పంచాయితీ
By: Tupaki Desk | 30 Jan 2023 1:30 PM ISTమహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం SSMB28. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఓ విషయం బయటకు వచ్చింది. SSMB28 నైఙాం హక్కులపై పంచాయితీ నడుస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా నైజాం రైట్స్ కోసం పోటా పోటీ నడుస్తోంది. ఇక మహేష్ తన 28 సినిమా ఆయన కెరియర్ లోనే బెస్ట్ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇక గత ఏడాది ప్రారంభంలోనే పూజా కార్యక్రమాలు జరుపకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టింది. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే మహేష్ తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ మరణించడంతో షూటింగ్ ఆగిపోయింది. దాంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. మార్చి వరకు లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. దాదాపు 60రోజులు బ్రేక్స్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరపనున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే తాజాగా మరోసారి SSMB 28 రిలీజ్ డేట్ విషయంలో నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తల మేరకు SSMB 28 సినిమా రిలీజ్ ఆగస్ట్ నుంచి ఇంకా వెనక్కి వెళ్లిందట. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది
ఇక మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించినున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు నిర్మిస్తున్నాడు. ఇటీవల శ్రీ లీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది అని ప్రకటించారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ రాజమౌళి తో చేయనున్నాడు. ఈ సినిమా పై వరల్డ్ వైడ్ గా అంచనాలు పెరిగిపోయాయి.