Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ విడుదల పై కొత్త పుకారు
By: Tupaki Desk | 2 Dec 2020 8:19 AM GMTపవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు 'వకీల్ సాబ్' సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్' కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా విడుదల అయ్యేది. కాని కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ పడింది. సినిమాను పునః ప్రారంభించి సంక్రాంతికి అయినా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లుగా వార్తుల వచ్చాయి. ఇటీవల షూటింగ్ ప్రారంభం అవ్వడం వల్ల సినిమా సంక్రాంతికి వస్తుందేమో అని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. కాని సంక్రాంతికి సినిమా రావడం లేదు అని బలంగా వాదన వినిపిస్తుంది.
ఇటీవల హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో తాను జనవరి నుండి పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే జనవరిలో కూడా ఇంకా షూటింగ్ ఉన్నట్లే కదా. అప్పుడు సంక్రాంతికి విడుదల చేయడం సాధ్యం కాదు కదా అంటూ కొందరు లాజిక్ తీస్తున్నారు. విడుదల చేయాలనుకుంటే సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం దిల్ రాజుకు పెద్ద కష్టం కాదు. కాని థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. ఈ సమయంలో థియేటర్లలోకి వకీల్ సాబ్ ను తీసుకు వెళ్తే నష్టపోవాల్సి వస్తుందేమో అంటూ దిల్ రాజు భావన. అందుకే ఈ సినిమాను ఉగాది కానుకగా తీసుకు వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కాస్త లోతుగా ఆలోచిస్తే సినిమాను ఉగాదికి విడుదల చేయడమే అన్ని విధాలుగా మంచిది కనుక దిల్ రాజు అదే నిర్ణయాన్ని తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ పుకారే త్వరలో అఫిషిల్ అనౌన్స్ మెంట్ గా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.