Begin typing your search above and press return to search.
'కొరటాల - బన్నీ' ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చింది కానీ..!
By: Tupaki Desk | 17 April 2021 7:39 AM GMTడైరెక్టర్ కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో '#AA21' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా.. శాండీ - స్వాతి - నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తారని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం బన్నీ చేస్తున్న 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు. అయితే 'పుష్ప' షూటింగ్ లేట్ అవుతుండటంతో, ముందుగా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కొరటాల. దీంతో అసలు బన్నీ - కొరటాల సినిమా ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా కచ్చితంగా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు 'పుష్ప' తరువాత ఇదే సినిమా ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ అనుకున్న సమయానికి రాకపోవచ్చు. ఎప్పుడొచ్చినా 'పుష్ప' రిజల్ట్ ని బట్టి బన్నీ గేమ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ ని టార్గెట్ చేసిన బన్నీ.. ఆ తరువాత వచ్చే కథలు కూడా యూనివర్సల్ గానే ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బన్నీ కోసం కొరటాల రెడీ చేసిన స్టోరీ 'యువ' సినిమా తరహాలో స్టూడెంట్ పాలిటిక్స్ మీద ఉంటుందట. ఇది లోకల్ నేటివిటీతో ఉందని.. దాన్ని పాన్ ఇండియా స్టోరీగా తీసుకెళ్లాల్సిందిగా దర్శకుడికి బన్నీ సూచించాడట. ప్రస్తుతం వీరిద్దరు బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పని పెండింగ్ లో పడింది. దీంతో 'పుష్ప' సినిమా తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుందా లేదా అనే పుకార్లు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.