Begin typing your search above and press return to search.

అడ‌వుల్లో ఆ మ‌ర‌మ్మ‌త్తులేమిటి పుష్పా?

By:  Tupaki Desk   |   19 Jun 2020 5:30 AM GMT
అడ‌వుల్లో ఆ మ‌ర‌మ్మ‌త్తులేమిటి పుష్పా?
X
లాక్ డౌన్ వ‌ల్ల సినిమాల షెడ్యూల్స్ లో అనూహ్య మార్పులొచ్చిన సంగ‌తి తెలిసిందే. విదేశీ షూటింగులు.. ఇరుగు పొరుగు రా‌ష్ట్రాల్లో అనుకున్న షూటింగుల్ని కూడా ఇప్పుడు లోక‌ల్ లోనే చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం బ‌న్ని `పుష్ప` షెడ్యూల్స్ కూడా ఇదే తీరుగా తారుమార‌య్యాయి. ఇంత‌కుముందు తిరుమ‌ల శేషా చ‌లం అడ‌వుల్లో అనుమ‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో బ్యాంకాక్ - థాయ్ ల్యాండ్ అడ‌వుల్లో షెడ్యూల్ చేయాల‌నుకున్నారు. కానీ అది కొవిడ్ వ‌ల్ల కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత కేర‌ళ‌లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ప్లాన్ చేశారు. కానీ దానికి వీలు చిక్క‌లేదు. లాక్ డౌన్ తో చిక్కులొచ్చి ప‌డ‌డంతో మొత్తం ప్లాన్ మార్చేయాల్సి వ‌చ్చింది.

ఆ క్ర‌మంలోనే సుకుమార్ అండ్ టీమ్ రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో అట‌వీ ప్రాంతంపై దృష్టి సారించారు. అక్క‌డ ఏజెన్సీలో ర‌క‌ర‌కాల లొకేష‌న్ల‌ను వెతికార‌ని తెలుస్తోంది. అందులో మారేడుమిల్లి అట‌వీ ప్రాంతం ప‌ర్ఫెక్ట్ అని భావించి అక్క‌డ షెడ్యూల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటీరియ‌ర్ ఏరియా కాబ‌ట్టి అక్క‌డ రోడ్ల వ‌స‌తి అంత బావుండ‌దు. అందుకే పుష్ప టీమ్ రోడ్లు మరమ్మతులు చేయిస్తోంద‌ట‌.

షూటింగుల పేరుతో రోడ్లు వేయ‌డం అన్న‌ది ఆస‌క్తి క‌లిగించేదే. అయితే ఆ మేర‌కు అది చిత్ర‌బృందానికి అద‌న‌పు బ‌ర్డెన్ అనే చెప్పాలి. మ‌రోవైపు మారేడు ప‌ల్లికి అత్యంత స‌మీపంలో ఉండే గోదావ‌రి ప‌రిస‌రాల్లో సెట్లు వేస్తున్నారు. అక్క‌డా షూటింగ్ జ‌రుగుతుంది. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో కూడా సెట్లు వేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ పుష్ప షెడ్యూల్స్ గురించి అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.

ఇక మారేడుమిల్లి ఏరియా సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 96 కి. మీ దూరంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో తప్పక చూడాల్సిన ప్రదేశమిది. ఇక్కడి ప్రకృతి అందాలు మనసు దోచుకుంటాయి. ఈ ప్రాంతంలో విలక్షణమైన గిరిజన జీవనశైలి.. స్థానికంగా ప్రకృతి అందాలు అబ్బుర‌ప‌రుస్తాయి. న‌దులు.. జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆకుపచ్చ లోయలు.. వృక్షజాలం పరవశింపజేస్తాయి. ఇక్కడికి హైదరాబాద్.. కాకినాడ.. విశాఖపట్నం నుంచి యాత్రికులు విశేషంగా త‌ర‌లి వెళుతుంటారు.