Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' విజువ‌ల్ స‌ర్ప్రైజ్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   25 Feb 2022 7:13 AM GMT
రాధేశ్యామ్ విజువ‌ల్ స‌ర్ప్రైజ్ వ‌చ్చేసింది
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌` పై అంచ‌నాలు స్కై హైకి చేరుకుంటున్నాయి. ముందు నుంచి ఈ మూవీ ఓ విజువ‌ల్ వండ‌ర్ గా వుండ‌బోతోందంటూ మేక‌ర్స్ హింట్ ఇస్తూ వ‌స్తున్నారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ లు ప్రూవ్ చేశాయి. విధి ఆడిన వింత నాట‌కంలో ఓ జంట ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. చివ‌రికి విధి విజ‌యం సాధించిందా? లేక వారి ప్రేమే విధిని జ‌యించి త‌మ ప్రేమ‌ని పొందింద అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థనాల‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది.

ట్రైల‌ర్ లోనే కొంత వ‌ర‌కు సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. అంతే కాకుండా హాలీవుడ్ స్థాయి సినిమా ఎక్స్‌పీరియ‌న్స్ ని `రాధేశ్యామ్‌` ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఇవ్వ‌బోతోంద‌ని, ఈ విష‌యంలో ప్రేక్ష‌కుల్ని ఓ విధంగా స‌ర్ ప్రైజ్ కి గురిచేస‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రిలో విడుద‌ల కావాల్సిన ఈ మూవీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డి మార్చి 11న థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా సంద‌డి చేయ‌బోతోంది. అయితే ఇంత వ‌ర‌కు ప్ర‌యోష‌న్స్ ని ప్రారంభించ‌లేదు చిత్ర బృందం.

దీంతో ఫ్యాన్స్ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మేక‌ర్స్ పై కామెంట్ లు చేస్తున్నారు. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా పాన్ ఇండియా మూవీకి ప్ర‌మోష‌న్స్ ఏవంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే వారికి గుడ్ న్యూస్ చెబుతూ `రాధేశ్యామ్‌` టీమ్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేసింది. ఈ నేప‌థ్యంలో గురువారం ఓ ప్ర‌క‌టిన విడుద‌ల చేసింది. కృష్ణ కాంత్ రాయ‌గాయువ‌న్ శంక‌ర్ రాజా, హ‌రిని ఇవ‌టూరి ఆల‌పించిన `ఈ రాత‌లే అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ వీడియోకు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేసింది.

శుక్ర‌వారం ఈ పాట‌కు సంబంధించిన పూర్తి లిరిక‌ల్ వీడియోని శుక్ర‌వారం విడుద‌ల చేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది. ప్ర‌క‌టించిన‌ట్టుగానే శుక్ర‌వారం `ఈఈ రాత‌లే .. అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసింది. విజువ‌ల్ వండ‌ర్ గా ప్ర‌తీ ఫ్రేమ్ ఓ దృశ్య‌కావ్యంలా వుంటుంద‌ని ప్రారంభం నుంచి వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజా పాట‌కు సంబంధించిన విజువ‌ల్స్ కూడా ఆడియ‌న్స్ తో పాటు అభిమానుల్ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోను చేయ‌డం ఖాయం అనే మాట‌లు వినిపించాయి.

తాజాగా విడుద‌లైన ఈ సాంగ్ లిరిక‌ల్ విజుల్స్‌ అక్ష‌రాలా నిజం చేశాయి. `ఎవ‌రో వీరెవ‌రో.. క‌ల‌వ‌ని ప్రేమికులా.. ఎవ‌రో వీరెవ‌రో విడిపోనీ యాత్రికులా.. అంటూ సాగిన ఈ పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ .. పాట‌లో క‌నిపించిన విజువ‌ల్స్ అద్భుతంగా వున్నాయి.

విధిని ఛాలెంజ్ చేసే ప్రేమ‌క‌థ‌గా ఈ సినిమా హాలీవుడ్ చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోని మేకింగ్ తో తీర్చిదిద్దిన‌ట్టుగా స్ప‌ష్ట‌మౌతోంది. ఈ పాట చూస్తుంటే సినిమాలోని ప్ర‌తీ ఫ్రేమ్ ఓ విజువ‌ల్ వండ‌ర్ లా.. ఓ ప్రేమ కావ్యంలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ పాట‌ని బ‌ట్టి చూస్తుంటే క‌నిపించ‌కుండానే ఒక‌రి రోసం ఒక‌రు వెతికే ప్రేమ‌కుల క‌థ‌గా క‌నిపిస్తోంద‌ని, ఇద్ద‌రు క‌లిశాక వీరిని విధి ఎలా దూరం చేసింది? .. త‌మ ప్రేమ‌ని కాపాడు కోవ‌డం కోసం ఈ ప్రేమికులు ఆ విధిని ఎలా ఎదిరించారన్న క‌థ‌గా తెలుస్తోంది. మొత్తానికి `రాధేశ్యామ్‌` ఓ విజువ‌ల్ వండ‌ర్ గా వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. తాజా పాట విజువ‌ల్ వండ‌ర్ గా వుండ‌టంతో ఫ్యాన్స్ స‌ర్ ప్రైజ్ గా ఫీలవుతున్నార‌ట‌.