Begin typing your search above and press return to search.
బన్నీ సినిమా వెనుక కొత్త కథ
By: Tupaki Desk | 25 Jan 2019 1:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ కి దూరంగా ఉండబట్టి ఎనిమిది నెలలు దాటేసింది. నా పేరు సూర్య ఫలితం పాజిటివ్ గా వచ్చుంటే ఎలా ఉండేదో కాని అది డిజాస్టర్ కావడం బన్నీని బాగా డిస్టర్బ్ చేసింది. మరి పడింది మాములు కష్టం కాదాయే. హెయిర్ స్టైల్ మొదలుకుని ఒళ్ళు హూనం చేసుకుని బాడీ ని షేప్ చేసుకోవడం దాకా నానా రకాల ఇబ్బందులు పడ్డాడు. ఇంతా చేస్తే డిజాస్టర్ కొట్టింది ఫలితం. అందుకే కథల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని డిసైడైన అల్లు అర్జున్ రాజీ అన్న ప్రస్తావనే తీసుకురావడం లేదు.
రేపో ఎల్లుండో సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్న విక్రం కుమార్ సినిమాను ఈ కారణంగానే డ్రాప్ అయ్యాడు. సో జరిగింది అంతా మంచికే అన్నట్టు ఇన్ని నెలల నిరీక్షణ మళ్ళి హ్యాట్రిక్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జట్టు కట్టేలా చేసింది. అయితే ప్రకటన వచ్చింది కాని ఎప్పుడు షూటింగ్ మొదలుపెడతారు అనే క్లారిటీ లేకపోయింది. ఫిబ్రవరి 14 నుంచి ఉండబోతోందని సమాచారం. అయితే హీరొయిన్ సెలక్షన్ విషయంలో టీం మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నయట. సాధారణంగా తన సినిమాల్లో హీరొయిన్ ఎవరు అనేది బన్నీ తన ఆప్షన్స్ కొన్ని చెబుతాడు. అవి ఎలాగూ దర్శకులకు నచ్చేలా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.
అయితే నా పేరు సూర్యలో అను ఇమ్మనియేల్ కొంత వరకు మైనస్ అయ్యింది. అందుకే ఈసారి మొత్తం బరువంతా త్రివిక్రమ్ మీదే వదిలేసినట్టు తెలిసింది. మాటల మాంత్రికుడి మనసులో ఎవరు ఉన్నారో మాత్రం ఆయనకు బన్నీకి మాత్రమే తెలుసు. షూటింగ్ రోజునే ప్రకటిస్తారో లేక ఈ గ్యాప్ లో లీక్స్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. యాక్షన్ మిక్స్ ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే త్రివిక్రమ్ రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. జులాయి-సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి సహజంగానే అంచనాలు పెరగడం మొదలైంది