Begin typing your search above and press return to search.
నేషనల్ వైడ్ ప్రోమోషన్స్ కి ప్రభాస్ టీమ్ భారీ ప్లాన్
By: Tupaki Desk | 25 Feb 2022 1:30 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ `భీమ్లానాయక్` థీయేటర్లలో సందడి చేయడం మొదలైంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా పవర్ స్టార్ మాసీవ్ పాత్రలో నటించడంతో సినిమా ఓ రేంజ్ లో థియేటర్ల వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణతో ఈ మూవీ తరువాత రానున్న చిత్రాల మేకర్స్ లో మరింత జోష్ ఏర్పడింది. `భీమ్లానాయక్` కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో తరువాత మార్చిలో రానున్న `రాధేశ్యామ్` టీమ్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించారు. విధికి - ప్రేమకు మధ్య సాగే ఆసక్తికరమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడికి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ ఇప్పటికే ప్రారంభించేశారు. శుక్రవారం `ఈ రాతలే... అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల విడుదల చేశారు. ఈ పాటలోని ప్రతీ సన్నివేశాం ఓ విజువల్ వండర్ గా వుండటంతో ఆడియన్స్ సినిమా అద్భుతమైన విజువల్స్ తో సాగుతుందని, తెలుగు సినిమాల్లో `రాధేశ్యామ్` మరో రేంజ్ సినిమా అవుతుందని కామెంట్ లు చేస్తున్నారు.
ఇదిలా వుంటే రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో `రాధేశ్యామ్` ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం సరికొత్త ప్లాన్ లు వేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ప్లాట్ ఫామ్ ని ఎంచుకోబోతున్నారట. అంతే కాకుండా ఈ రొమాంటిక్ పిరియాడిక్ లవ్ డ్రామాని ప్రమోట్ చేయడం కోసం పాన్ ఇండియా స్థాయిలో టీమ్ ప్రత్యేక పర్యటన కోసం సిద్ధమవుతోందని తెలిసింది. ఈ ప్రమోషన్స్ లో హీరో ప్రభాస్ - పూజా హెగ్డే - దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తదితరులు పాల్గొనబోతున్నారట.
ముంబాయి - చెన్నై - హైదరాబాద్ - కొచ్చి - బెంగళూరు నగరాల్లో ప్రధానంగా `రాధేశ్యామ్` టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొననుందట. అనేక వాయిదాల తరువాత `రాధేశ్యామ్` ఎట్టకేలకు మార్చి 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా మీడియా సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. వరుస మీడియా ఇంటరాక్షన్ లతో సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేయబోతున్నారు.
ఈ మూవంఈ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించబోతున్న విషయం తెలిసిందే. ఇతర భాషల్లోనూ ఆయా భాషలకు చెందిన క్రేజీ స్టార్స్ వాయిస్ ఓవర్ లు అందించబోతున్నారు. యూరప్ నేపథ్యంలో సాగే వింటేజ్ ప్రేమకథగా ఈ మూవీని రూపొందించారు. ఇటలీలో మిస్ అయిన ట్రైన్... డావెన్సీ ఓడలని తలపించే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయట. `మైనే ప్యార్‌కియా` ఫేమ్ భాగ్యశ్రీ ... ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్ తో కలిసి టి సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.