Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: నిర్మాతల్లో షాకింగ్ రివల్యూషన్?
By: Tupaki Desk | 10 July 2019 10:09 AM GMTవార్త రాసినందుకు డబ్బు తీసుకుంటే దానిని లంచం అనకుండా ఉండగలరా? అయితే ఆ లంచగొండితనాన్ని అలవాటు చేసిన పాపంపై ప్రస్తుతం టాలీవుడ్- కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆరంభం దీనిని జర్నలిస్టు గౌరవ భృతిగా భావించేవారు. జమానా కాలం నుంచి పీఆర్వోలు- నిర్మాతలు దీనిని ఒక గౌరవప్రదమైన ప్యాకేజీగా లేదా కవర్ పేరుతో పెంచి పోషించారు. అయితే ఈ ప్రక్రియ ఒకప్పుడు గౌరవప్రదంగానే ఉండేది. ఎంతో దూరం నుంచి బండిలో పెట్రోల్ పోసుకుని వచ్చే రిపోర్టర్ ఎండనకా వాననకా చాలా కష్టపడతాడు .. పైగా కంపెనీలు ఇచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోదు కాబట్టి.. ఆ మాత్రం సాయం చేయాలి అని నిర్మాత- పీఆర్వో ఏర్పాటు చేసిన భృతి ఇది. అయితే ఇది కాలక్రమేణా గాడి తప్పింది. ఇక్కడ `కవర్` కోసమే వచ్చే జర్నలిస్టులు పెరగడంతో లక్షల్లో దానికే ఖర్చు చేయాల్సిన సన్నివేశం తలెత్తింది. 150- 400 మంది జర్నలిస్టులకు కవర్ రూపంలో చలానా కట్టేయాల్సి వస్తోందని వాపోతూనే నిర్మాతలు ముష్ఠి వేసే సన్నివేశం నెలకొంది. పైగా ప్రెస్ మీట్ కి వస్తే కవర్ తో పాటుగా భోజనాలు- కాఫీ -టీ-బిస్కెట్- సమోసా అంటూ చాలానే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
అయితే ఇవన్నీ నిర్మాతలకు అదనపు ఖర్చును పెంచాయన్న చర్చ టాలీవుడ్ లో నిరంతరం సాగుతూనే ఉంటుంది. నిర్మాత ప్రొడక్షన్ క్వాలిటీ పెంచేందుకు ఖర్చు చేయాలి కానీ.. ఇలాంటి దండగ పనులకు ఎందుకు? అన్న చర్చ సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. అయినా ఈ పద్ధతిని మాత్రం మార్చలేకపోయారు. ఇటు టాలీవుడ్ లో అయితే ప్రత్యక్షంగా 150 మంది జర్నలిస్టులు ప్రెస్ మీట్లకు ఎటెండవుతుంటారు. ఆ పేరుతో అంతమందికి కవర్ల ఏర్పాట్లు చేస్తుంటారు పీఆర్వోలు. అయితే అలా జర్నలిస్టుల పేరు చెప్పి నొక్కేసే ఈ కోఆర్డినేషన్ సిస్టమ్ పై జర్నలిస్టులు ఏనాడూ పాజిటివ్ గా లేరు. ఇక్కడ కవర్ పేరుతో దోపిడీ వ్యవస్థపైనా జర్నలిస్టులు మంటగానే ఉంటారు. జర్నలిస్టుల పేరు చెప్పి దోచేసే వ్యవస్థపై నిరంతరం 150 మంది జర్నలిస్టుల్లో చర్చ సాగుతూనే ఉంటుంది.
కేవలం టాలీవుడ్ సన్నివేశం ఇలా ఉంది! అనుకుంటే కోలీవుడ్ లో ఈ కవర్ సిస్టమ్ అనేది పూర్తిగా వెగటు పుట్టించే రేంజుకు చేరిపోయిందట. అక్కడ ఏకంగా 400 మంది జర్నలిస్టులు పీఆర్వో- నిర్మాతలపై పడి కవర్ దండుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతుండడంతో ప్రస్తుతం `కవర్` వ్యవస్థను రద్దు చేయడం సంచలనమైంది. కేవలం కవర్ మాత్రమే కటింగ్ కాదు.. ప్రెస్ మీట్లలో భోజనాలు వగైరా తిండి కార్యక్రమాల్ని రద్దు చేశారు. కేవలం టీ మాత్రమే ఉంటుందట ఇకపై. ఇప్పుడు అదే సిస్టమ్ ని తెలుగు సినీపరిశ్రమలో ప్రెస్ మీట్లకు వర్తింపజేయాలన్న ఒత్తిడి అట్నుంచి వచ్చిందని తెలుస్తోంది. ఆ మేరకు టాలీవుడ్ నిర్మాతల మండలికి చెన్నయ్ నుంచి ఓ సర్క్యులర్ అందింది. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (చెన్నయ్) నుంచి వచ్చిన ప్రతిపాదనపై మొన్న ఎన్నికైన తెలుగు సినిమా నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడు సి.కళ్యాణ్ సైతం సీరియస్ గానే ఆలోచిస్తున్నారని తెలిసింది. టాలీవుడ్ లో ఇకపై కవర్ సిస్టమ్ రద్దు చేయాలన్న ప్రతిపాదనపై నిర్మాతల్లో చర్చ సాగనుందని తెలుస్తోంది.