Begin typing your search above and press return to search.
బాలయ్య చిన్న కుమార్తెలో కొత్త టాలెంట్ బయటకు వచ్చింది
By: Tupaki Desk | 1 Feb 2022 9:35 AM GMTగతానికి భిన్నంగా బాలయ్య ఇప్పుడు మాంచి రైజ్ లో ఉన్నారు. ఆయనేం చేసినా ఆయన్ను సక్సెస్ అక్కున చేర్చుకుంటోంది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాను రిలీజ్ చేసే సాహసం చేయలేక కిందా మీదా పడుతున్న వేళ.. మిగిలిన వారికి భిన్నంగా బాలయ్య తన అఖండ మూవీని విడుదల చేయటం.. అది కాస్తా అఖండ విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. బాలయ్య కెరీర్ ను మరో లెవల్ కు తీసుకెళ్లిన ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది.
అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం గ్రామాల్లో అగ్రనటుల సినిమాల్ని చూసేందుకు మహిళలు ట్రాక్టర్ లో వెళ్లి వచ్చే సీన్ ను గుర్తుకు చేసే సీన్లు అఖండ సినిమా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద ఆయన చేసిన అన్‌స్టాపబుల్ బాలయ్య ప్రోగ్రాంకు అనూహ్యం ఆదరణ రావటం.. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో నడుస్తున్న ఈ షో ఇప్పుడు సంచలనంగా మారింది.
తొలుత ఈ షో కోసం బాలయ్యను అనుకోకున్నా.. అనుకోని రీతిలో ఆయనకు అప్పగించటం.. అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇప్పటికి 9 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ షో.. గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఈ షో ఇంత సక్సెస్ కావటానికి వెనుక ఎవరున్నారన్న ఆసక్తి అందరిలో వ్యక్తమవుతున్న వేళ.. ఈ షో సీజన్ 2ను షురూ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే.. ఈ షో విజయవంతం కావటానికి ఎంతో మంది పని చేసినా.. ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం.. రైటర్ గా పని చేసి బీవీఎస్ రవి.
ఆయన్ను పలువురు ఇంటర్వ్యూ చేయటం తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పని కొత్త విషయాన్ని వెల్లడించారు. అన్‌స్టాపబుల్ బాలయ్య షో కోసం.. ఆయన చిన్న కుమార్తె తేజస్విని పని చేసినట్లుగా రివీల్ చేశారు. బాలయ్యను సరికొత్తగా చూపేందుకు ఆమె చాలానే పరిశోధన చేశారని.. ఈ సందర్భంగా ఆయన లుక్ ను.. కాస్ట్యూమ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. బాలయ్య చిన్న కుమార్తెలోని ఈ టాలెంట్ గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే.. తర్వాతి సినిమాలో బాలయ్య కాస్ట్యూమ్స్ కోసం తేజస్విని ఎంపిక చేస్తే ఎంచక్కా సరిపోతుంది.