Begin typing your search above and press return to search.

ఏపీలో 'రాధేశ్యామ్' కు కొత్త టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   10 March 2022 7:29 AM GMT
ఏపీలో రాధేశ్యామ్ కు కొత్త టెన్ష‌న్‌
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ చిత్రం 'రాధేశ్యామ్‌' ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌ల‌వుతోంది. దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే సినిమా వుంటుంద‌నే సంకేతాల్ని తాజాగా విడుద‌ల చేసిన రిలీజ్ ట్రైల‌ర్ క‌లిగించింది. దీంతో వర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జ‌రుగుతున్నాయి. మ‌రి కొన్ని గంట‌ల్లో సినిమా రిలీజ్‌ అవుతుండ‌గా మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రీమియ‌ర్స్ ప్రారంభం కాబోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఏపీ లో 'రాధేశ్యామ్‌'కు బిగ్ షాక్ త‌గిన‌ట్టుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త కొంత కాలంగా టాలీవుడ్ చిత్రాల‌కు టికెట్ రేట్ల‌ని పెంచుకునే వీలు లేకుండా ఏపీ ప్ర‌భుత్వం జీవో నం.35 పేరుతో కొత్త జీవోని తీసుకొచ్చింది. అప్ప‌టి నుంచి భారీ చిత్రాలు టికెట్ రేట్ల విష‌యంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి.

కొన్ని చిత్రాలు బ‌డ్జెట్ ని బ‌ట్టి సేఫ్ గా బ‌య‌ట‌ప‌డితే మ‌రి కొన్ని చిత్రాలు బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాల‌ని మిగిల్చాయి. అయితే ఈ ప‌ద్దతిలో మార్పుని కోరుతో ఇండ‌స్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, ఆర్ . నారాయ‌ణ మూర్తి ప్ర‌త్యేకంగా ఏపీ ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు.

ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కు అంటే తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జీవో 35ని స‌వ‌రిస్తూ భారీ చిత్రాలు, వంద కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రాలు, ఏపీలో 20 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న చిత్రాల‌కు టికెట్ రేట్ల‌ని పెంచుకోవ‌చ్చ‌ని, ఐద‌వ షోని ప్ర‌ద‌ర్శించ‌కోవ‌చ్చ‌ని కొత్త జీవోని విడుద‌ల చేసింది. దీంతో ఇండ‌స్ట్రీ అంతా సంబ‌రాలు చేసుకున్నారు. ఇక పై విడుద‌ల‌య్యే పెద్ద‌చిత్రాల‌కు ఈ జీవో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంతా భావించారు.

జీవో విడుద‌లైన త‌రువాత 'రాధేశ్యామ్‌' థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ల‌భించే అవ‌కాశం వుంద‌ని, తాజా జీవో ఈ చిత్రానికి మ‌రింత స‌పోర్ట్ గా నిలుస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, 'రాధేశ్యామ్‌' మేక‌ర్స్ భావించారు. కానీ ఈ మూవీ మ‌రి కొన్ని గంట‌ల్లో రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ఏపీకి చెందిన థియేట‌ర్ల‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

రిలీజ్ వేళ బుక్ మై షో సైట్ తో టికెట్ బుక్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికి సైట్ లో 'రాధేశ్యామ్‌' క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్ర‌భుత్వం టికెట్ హైక్ కి సంబంధించిన జీవోని విడుద‌ల చేసిన త‌రువాత కూడా ఏపీ లో ఓ భారీ చిత్రానికి ఇలాంటి ప‌రిస్థితి ఏంట‌ని, ఇది బుక్ మై షో సైట్ లో జ‌రిగిన టెక్నిక‌ల్ లోప‌మా లేక ఏపీ ప్ర‌భుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తామే ప్రారంభిస్తామ‌ని చెప్ప‌డం వ‌ల్లే 'రాధేశ్యామ్‌' టికెట్స్ ఇంకా ఏపీలో బుక్ కావ‌డం లేదా? అన్న‌ది ఇప్ప‌డు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.