Begin typing your search above and press return to search.

వైరస్ కి భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు రాక‌పోతే?

By:  Tupaki Desk   |   3 April 2020 6:30 AM GMT
వైరస్ కి భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు రాక‌పోతే?
X
క‌రోనా వైర‌స్ చైన్ రియాక్ష‌న్ ప్ర‌పంచాన్ని అట్టుడికించేస్తోంది. అన్ని బిజినెస్ లు అల్లాడిపోతున్నాయి. లాక్ డౌన్ తొలగిస్తే త‌ప్ప చాలా వ్యాపారాలు నిల‌బ‌డ‌ని ప‌రిస్థితి ఉంది. దేశంలో నెల‌రోజుల లాక్ డౌన్ తో అల్ల‌క‌ల్లోలం అయిన కార్పొరెట్ తిరిగి కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పోతే ఈ లాక్ డౌన్ ఇటు టాలీవుడ్ వ‌ర్గాల్లోనూ టెన్ష‌న్ కి కార‌ణ‌మ‌వుతోంది. ముఖ్యంగా నిర్మాత‌లు- పంపిణీదారులు- థియేట‌ర్ య‌జ‌మానుల్ని లాక్ డౌన్ విప‌రీతంగా టెన్ష‌న్ పెట్టేస్తోంది.

ఇంత‌కీ ఆ మూడు వ‌ర్గాల్లో టెన్ష‌న్ దేనికి? లాక్ డౌన్ ఎత్తేస్తే స‌జావుగా సినిమాలు రిలీజ్ చేసుకోవ‌చ్చు క‌దా? అంటారా? అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితిని మ‌రికాస్త లోతుగా అధ్య‌య‌నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ల‌లో టెన్ష‌న్ కి మ‌రో ఊహించ‌ని కార‌ణం క‌నిపిస్తోంది. ఇప్పుడున్న విప‌త్తు కేవ‌లం ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ తో అంత‌మ‌య్యేది కాదని నిర్మాత‌లు - పంపిణీదారులు - థియేట‌ర్ వ‌ర్గాలు క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నాయ‌ట‌.

ఒక‌వేళ మార్చి - ఏప్రిల్ లో లాక్ డౌన్ అయినా మేలో థియేట‌ర్లు ఓపెన్ చేసినా జ‌నాల్ని ర‌ప్పించ‌డం అంత సులువేనా? అన్న టెన్ష‌న్ లోలోన మ‌రిగిస్తోంద‌ట‌. వైర‌స్ కి భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు జ‌నం వ‌స్తారా రారా? అన్న మీమాంశ ఒణికించేస్తోంద‌ట‌. ఇక ఇన్ని రోజుల లాక్ డౌన్ త‌ర్వాత థియేట‌ర్లు ఓపెన్ చేస్తే జ‌నం వినోదానికి మొహం వాచి ఉన్న‌ట్టుండి ఎగ‌బ‌డే ప‌రిస్థితి ఉంటుందా? అంటే.. ఒక‌వేళ అలా జ‌రిగినా ఇబ్బందిక‌ర‌మే. ఒక్క‌సారే మీద‌ప‌డినా అది కాలిపోయే వ్య‌వ‌హార‌మేన‌ని ఒక సెక్ష‌న్ జ‌నం విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా మేలో రిలీజ‌య్యే సినిమాల‌కు ఇది వ‌ర‌మా లేక శాప‌మా? అన్న‌ది కాస్త ఆగితే కానీ తెలీదు. ఒక్క‌సారిగా ఎగ‌బ‌డి థియేట‌ర్లు ఫిల్ అయితే అది మేలే కానీ ఇంకా వైర‌స్ అంటూ ఇండ్ల నుంచి జ‌నం బ‌య‌టికి రాక‌పోతేనే ఇబ్బంది. ఇక‌పోతే ప్ర‌స్తుతం మ‌నిషిని మ‌నిషి తాక కుండా సామాజిక దూరం పాటించిన‌ట్టే థియేట‌ర్ల‌లో చైర్ కి చైర్ కి మ‌ధ్య దూరం పెంచేందుకు ప్ర‌తి రెండు కుర్చీల మ‌ధ్య ఉన్న ఒక కుర్చీని తొల‌గించేస్తేనే మేలు జ‌రుగుతుందేమో.. ప్చ్‌..! దీనివ‌ల్ల 50 శాతం కుర్చీలు త‌గ్గి రిస్క్ కూడా చాలా వ‌ర‌కూ త‌గ్గుతుంది మ‌రి.