Begin typing your search above and press return to search.

కొత్త టైటిల్స్ భలేగా ఉన్నాయే!!

By:  Tupaki Desk   |   25 Dec 2016 5:30 PM GMT
కొత్త టైటిల్స్ భలేగా ఉన్నాయే!!
X
టాలీవుడ్ లోకి కొత్త తరం వేగంగానే దూసుకొచ్చేస్తోంది. అనేక మంది ఔత్సాహికులు దర్శకులుగా నిరూపించుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్స్.. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నవారిని కూడా పరుగులు పెట్టించేలా చేస్తోంది. అందుకే టైటిల్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది.

తాజాగా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్ద నిర్మాణ సంస్థలు తర్వాత సమస్యలు రాకుండా తాము అనుకునే టైటిల్స్ ను రిజిస్టర్ చేయించేసుకోవడం ఆనవాయితీ. అవే టైటిల్స్ చివరకు ఉండాలనే రూల్ ఏమీ లేదు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎంఎస్ రాజు.. ఆయన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాయి. 'నాన్నతో ప్రయాణం'.. 'రాఠీ' అనే పేర్లు వీరి ఖాతాలోకి చేరాయి. మొదటి టైటిల్ వినగానే ఫ్యామిలీ డ్రామా అనే సంగతి తెలిసిపోతుండగా.. రాఠీ టైటిల్ తో ఓ మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు దర్శకుడు మారుతి.. తన మారుతి టాకీస్ బ్యానర్ పై 'పెళ్లి కళ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. పెళ్లి కళ కూడా ఆసక్తి రేపుతోంది. ఎవరితో తీస్తున్నారో.. తనే డైరెక్ట్ చేస్తాడో లేదో కూడా ఇన్ఫర్మేషన్ లేదు కానీ.. మారుతి నిర్మాణంలోనే ఈ చిత్రం ఉండనుందిట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/