Begin typing your search above and press return to search.

ట్రెండ్ : 2015 లో గెడ్డం పెంచడమే స్టైల్

By:  Tupaki Desk   |   3 Sep 2015 7:10 AM GMT
ట్రెండ్ : 2015 లో గెడ్డం పెంచడమే స్టైల్
X
సినిమా అంటేనే స్టైలింగ్. కాలంతోపాటు మారిపోతూ ఉంటాయి మూవీలు. కేవలం సినిమాలే కాదు.. హీరో హీరోయిన్స్ కూడా ఎప్పటికప్పుడు తమ స్టైల్ మార్చేస్తుంటారు. కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఆరాపడుతుంటారు. ఆ ఏడాదికి ఏది ట్రెండో... దాన్ని పక్కాగా ఫాలో అయిపోతుంటారు.

సిక్స్ ప్యాక్ హంగామా కూడా ఇలాంటిదే. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ హీరోలు గెడ్డం పెంచడం. అది కూడా లైట్ గా కాదు.. పెద్ద గెడ్డాన్ని కొత్త స్టైల్ లో కట్ చేసి చూపించడం. రిలీజ్ కు రెడీ అయిన డైనమైట్ లో మంచు విష్ణు ఇలాగే దర్శనం ఇస్తున్నాడు . ఓసారి ఫారిన్ టూర్ వెళ్లినపుడు... 2015లో గెడ్డం ఫ్యాషన్ అవుతుంది అని తెలుసుకున్నాడట. అంతే... డైనమైట్ లో పెద్ద గడ్డంతో కనిపించేశాడు. జనాలకు ఏదైనా కొత్తగా చూపించాల్సిందే అంటున్నాడు విష్ణు.

విష్ణు ఒక్కడే కాదు.. సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా గెడ్డం లుక్ తోనే కనిపించబోతున్నాడు. కబాలి కోసం... రజినీకాంత్ కూడా పెద్ద గడ్డం పెంచి... మళ్లీ బాషా లుక్ చూపించబోతున్నాడు. బాహుబలిలో ప్రభాస్, రాణాలు ఇలాగే కనిపిస్తున్నారు. ఇంత పెద్దగా కాకపోయినా.. అఖిల్, చరణ్ లు కూడా క్లీన్ షేవ్ లో మాత్రం కనిపించడం లేదు. మొన్నటివరకూ పవన్ కూడా ఇంతేసి గెడ్డం పెంచితే సినిమా కోసమే అనుకున్నారు కానీ... ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా అన్నాడు కదా... అందుకే తీసేసినట్లున్నాడు.