Begin typing your search above and press return to search.
#నయా ట్రెండ్.. రెండు భాగాల ప్లాన్ బాగా వర్కవుటవుతోందా?
By: Tupaki Desk | 15 July 2021 8:27 AM GMTఇటీవలి కాలంలో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బహుభాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. దీంతో పాటే రెండు భాగాలుగా సినిమాలు తీయడం అన్నది ఫ్యాషన్ గా మారింది. మొదటి భాగం బంపర్ హిట్ కొడితే రెండో భాగంతో భారీ లాభాలార్జించే టెక్నిక్ ని వర్కవుట్ చేస్తున్నారు. అయితే దీనికి ఆద్యం మాత్రం బాహుబలి ఫ్రాంఛైజీ అని చెప్పాలి. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి దీనికి ఆజ్యం పోసింది ది గ్రేట్ ఆర్కా మీడియా.
నిజానికి బాహుబలి చిత్రాన్ని ఒక భాగంగా తెరకెక్కించాలని రాజమౌళి తొలుత భావించినా కథను డెవలప్ చేసే క్రమంలో రెండు భాగాలకు స్కోప్ లభించింది. మొదటి భాగంలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ? అంటూ సస్పెన్స్ ని క్రియేట్ చేసి బాహుబలి ఫ్రాంఛైజీని సంచలన విజయం వైపు నడిపించారు. మార్కెటింగ్ టెక్నిక్ లోనూ జాతీయ సినిమాకే నేర్పించారు మనోళ్లు.
బాహుబలి స్ఫూర్తితోనే కేజీఎఫ్ ఫ్రాంఛైజీని రెండు భాగాలు గా రూపొందిస్తూ ప్రశాంత్ నీల్ సంచలనాలకు తెరతీసారు. కేజీఎఫ్ చాప్టర్ 1 సంచలన విజయం సాధించడంతో అతడు వెంటనే పార్ట్ 2 ని ప్రారంభించారు. త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలకు తెర తీసేందుకు సిద్ధమవుతోంది.
ఆ తర్వాత ఈ ఫార్మాట్ ని అనుసరించే దర్శకనిర్మాతలు పెరిగారు. మలయాళంలో దృశ్యం ఫ్రాంఛైజీ ఇలానే సక్సెసైంది. దృశ్యం క్లైమాక్స్ లోనే సీక్వెల్ కథ ఉంది అంటూ ఎలివేట్ చేసిన దర్శకుడు జీతూ జోసెఫ్ తెలివిగా రెండ బాగాన్ని గ్రిప్పింగ్ గా తెరకెక్కించి సక్సెస్ చేశారు.
ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ఇదే కేటగిరీలో రూపొందుతోంది. పుష్ప డ్యూయాలజీ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ లో తొలి భాగం ఈ ఏడాది రిలీజవుతుంది. కొంత గ్యాప్ తర్వాత సుకుమార్ సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేస్తారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ గా మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఇక పార్ట్ 1 వర్కవుటైతే పార్ట్ 2ని అంతకుమించి అనేలా రూపొందించాలన్న ప్లాన్ ఉంది.
బాహుబలి.. దృశ్యం ఫ్రాంఛైజీలు రెండు భాగాలతో ఈ ఫార్మాట్ లో ఘనవిజయాల్ని అందుకోగా కేజీఎఫ్ 2 సంచలనాల కోసమే ప్రస్తుతం వెయిటింగ్. అయితే అన్ని సినిమాలు బాహుబలి .. కేజీఎఫ్ కాలేవు. కొన్నిటికి కథల పరంగా పరిమితులు ఉంటాయన్నది పరిశీలించాలి. ఇక బాహుబలి తరహాలోనే ఆర్.ఆర్.ఆర్ కి సీక్వెల్ ఆలోచన జక్కన్న మైండ్ లో ఉందా? అన్నదానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆన్సర్ లేదు. అది జక్కన్న మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది.
ఇకపోతే తమిళంలో చియాన్ విక్రమ్ నటించిన `ధృవ నక్షత్రం` చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు గౌతమ్ మీనన్ బృందం సన్నాహకాల్లో ఉందని తెలిసింది. నిజానికి ధృవనక్షత్రం చాలా కాలం ఆలస్యమైన ప్రాజెక్ట్. బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ చిత్రం మూడేళ్ళకు పైగానే ల్యాబుల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రాజెక్టును హస్తగతం చేసుకుని రీవ్యాంప్ చేస్తోంది. ప్రొడక్షన్ హౌస్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ..ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.
గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి నాలుగున్నర గంటల ఫుటేజ్ ని చిత్రీకరించారు కాబట్టి రెండు భాగాల రిలీజ్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయిలు రీతు వర్మ.. ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. పార్థీపాన్- రాధిక- దివ్యదర్శిని- వంశీ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రతి షెడ్యూల్ మధ్య ఊహించని ఆలస్యం కారణంగా చాలామంది సినిమాటోగ్రాఫర్లు మారారని తెలుస్తోంది.
కేవలం ఈ సినిమాలే కాదు.. అటు కోలీవుడ్ మాలీవుడ్ లోనూ మునుముందు ఇదే ఫార్మాట్ లో మరిన్ని చిత్రాల్ని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నాయి. కొన్ని భారీ పాన్ ఇండియా సినిమాలకు పార్ట్ 2 ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ వాటికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా విడుదల చేయాల్సి ఉంటుంది.