Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో కాసులు కురిపిస్తున్న కొత్త ట్రెండ్!
By: Tupaki Desk | 30 Sep 2022 2:30 AM GMTటాలీవుడ్ లో ఇప్పడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. క్రేజీ హీరోల కెరీర్ లని మలుపు తిప్పి మరపు రాని సినిమాలుగా నిలిచిన బ్లాక్ బస్టర్ హిట్ లని 4కె టెక్నాలజీలోకి రీ మాస్టరింగ్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ 'పోకిరి'తో మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇంటస్ట్రీలో కాసులు వర్షం కురిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని వల్ల అభిమానులుకు కొత్త అనుభూతి లభించడంతో పాటు మేకర్స్ కి భారీ స్థాయిలో డబ్బు కూడా వస్తుండటంతో ఇప్పడు రీ మాస్టరింగ్ ట్రెండ్ గా మారింది.
క్రేజీ స్టార్ హీరోల పుట్టిన రోజుని ప్రత్యేకంగా ఎంచుకుంటూ అభిమానులు వారి కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్స్ ని 4కె లోకి రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేయమంటూ మేకర్స్ పై ఒత్తిడి తెస్తున్నారు. అకేషన్ సందర్భంగా ఫ్యాన్స్ ని ఖుషీ చేసినట్టుగా వుంటుంది, రిలీజ్ తరువాత కూడా సినిమాకు భారీ మొత్తాన్ని రాబట్టినట్టుగా వుంటుందని చాలా మంది 4కెలోకి మార్చి రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అంతే కాకుండా నేటీ తరం కూడా కొన్నేళ్ల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన సినిమాలని చూసే వీలు లభించడంతో ఇలాంటి మూవీస్ కలెక్షన్ లు కూడా భారీగానే వస్తున్నాయి.
అంతే కాకుండా థియేటర్లకు మంచి ఫీడింగ్ కూడా లభిస్తోంది. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, అస్ట్రేలియా, సింగపూర్, కెరడా వంటి దేశాల్లో రీరిలీజ్ లకు మంచి క్రేజ్ ఏర్పడటంతో చాలా మంది మేకర్స్ బ్లాక్ బస్టర్ మూవీస్ ని రీ మాస్టర్ చేసి రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ ట్రెండ్ కు అసలు శ్రీకారం చుట్టిన మూవీ 'మాయాబజార్', మొఘల్ ఏ అజం. ఈ రెండు సినిమాలని కలర్ లోకి మార్చి రిలీజ్ చేశారు. అదే ఇప్పడు 4కె కు నాందిపలికింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' సినిమాని రీ మాస్టర్ చేయడం తో అసలు ట్రెండ్ మొదలైంది. ముందు ఈ మూవీని యుఎస్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ భారీ స్పందన లభించడంతో ఇక్కడ కూడా భారీ స్థాయిలో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేశారు. యుఎస్ బుకింగ్స్ తో కలిసి భారీగానే కలెక్షన్స్ లభించాయి. ఇదే జోరుతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా' మూవీని కూడా 4కెలోకి రీమాస్టర్ చేసి పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ఇక 20 ఏల్ల క్రితం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'చెన్నకేశవరెడ్డి'ని రీ రిలీజ్ చేశారు. ఇది కూడా సంచలనం సృష్టించింది. ఇదే తరమాలో మరి కొన్ని సినిమాలు కూడా రీరిలీజ్ కాబోతున్నాయి. ప్రభాస్ వర్షం, బిల్లా, చిరంజీవి ఇంద్ర, జగదేకవీరుడు అతిలోక సుందరి, మహేష్ అతడు, ఖలేజా, ఎన్టీఆర్ 'ఆది'తో పాటు పలు క్రేజీ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఇక ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'సింహాసనం' 8 కెలో రాబోతుండగా 'అల్లూరి సీతారామరాజు'ని కూడా రీరిలీజ్ చేయబోతున్నారు.
రీ మాస్టరింగ్ ద్వారా వసూళ్లు కూడా భారీగానే వుండటం.. పక్కన పడేసిన సినిమాలకు కూడా మళ్లీ రీ మాస్టరింగ్ ద్వారా మళ్లీ డబ్బులు వస్తుండటంతో చాలా వరకు ఈ విధానాకి సై అనడంతో ఇప్పుడిది టాలీవుడ్ తో నయా ట్రెండ్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.