Begin typing your search above and press return to search.
విక్కీ, కత్రినాల వెడ్డింగ్ స్టోరీలో కొత్త ట్విస్ట్
By: Tupaki Desk | 26 Nov 2021 3:41 PM GMTసెలెబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు అఫీషియల్‌గా బైటికొచ్చేవరకు అంతా కన్‌ఫ్యూజనే. నిజంగానే లవ్‌లో ఉన్నారా, అనుకున్నట్టే పెళ్లి పీటలెక్కుతారా అంటూ ఒకటే సందేహాలు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. ఇద్దరూ ముందుగా కోర్ట్ మేరేజ్ చేసుకుంటారని.. ఆ తర్వాత డిసెంబర్ 9న రాజస్థాన్‌లో పెళ్లి అని.. కొద్దిమంది మాత్రమే వస్తారని.. ఫొటోలు, వీడియోలు కూడా తీయడానికి అనుమతి లేదని.. ఒకటా రెండా, కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి వార్తలు. అయితే ఇప్పుడు బైటికొచ్చిన ఓ న్యూస్ మొత్తం కథనే మార్చి పారేసింది.
చెప్పాలంటే ఇంతవరకు కత్రినా కానీ, విక్కీ కానీ ఈ విషయంలో నోరు మెదపలేదు. అందరూ అనుకుంటున్నట్టు మొన్న దీపావళికి రోకా వేడుక జరిగిందని కానీ, వచ్చే నెలలో పెళ్లి జరుగుతుందని కానీ చెప్పలేదు. దాంతో ఎప్పుడు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్లయితే ఏదీ రివీల్ చేయలేదు కానీ విక్కీ సిస్టర్ మాత్రం బుర్ర గిర్రున తిరిగే విషయం ఒకటి చెప్పింది. విక్కీ, కత్రినాల పెళ్లి వార్తలో అసలు నిజమే లేదంటోందామె.
విక్కీకి డాక్టర్ ఉపాసనా వోరా అనే కజిన్ ఉంది. ఆవిడ రీసెంట్‌గా ఓ హిందీ డైలీతో మాట్లాడింది. విక్కీ పెళ్లి గురించిన ప్రస్తావన రాగానే పెళ్లా, అలాంటిదేమీ లేదే అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టింది. ‘విక్కీ, కత్రినాల పెళ్లి వార్త ఎవరు పుట్టించారో కానీ అందులో నిజం లేదు. అసలు వాళ్లకి అలాంటి ఆలోచనే లేదు. ఒకవేళ ఉన్నా ఇప్పుడైతే పెళ్లి జరగడం లేదు' అంటూ కుండ బద్దలు కొట్టింది. రీసెంట్‌గానే తన అన్నతో మాట్లాడానని, అలాంటిదేమైనా ఉంటే తనకి చెప్పేవాడని అంది.
ఆమె మాటలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. విక్ట్రీనా పెళ్లి విషయంలో కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి. ముహూర్తాలు పెట్టేసుకున్నారు.. గెస్ట్ లిస్టులు రెడీ చేసేసుకున్నారు.. త్వరలో ఒక్కటైపోతారు అంటూ వస్తున్న వార్తల విషయంలోనే క్లారిటీ లేదురా దేవుడా అంటే ఇప్పుడు మళ్లీ ఇదో కన్‌ఫ్యూజనా అంటున్నారంతా. మరి ఇప్పటికైనా క్యాట్ కానీ, విక్కీ కానీ ముందుకొచ్చి విషయం చెబితే ఏది రూమరో, ఏది నిజమో కాస్తయినా క్లారిటీ వస్తుందేమో.