Begin typing your search above and press return to search.
అందరికంటే రాజుగారికే పెద్ద దెబ్బ!
By: Tupaki Desk | 29 March 2020 4:30 PM GMTటాలీవుడ్ లో కార్యకలాపాలన్నీ స్థంబించిపోయాయి. షూటింగులు లేవు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేవు.. థియేటర్లన్నీ బంద్ కాబట్టి రిలీజులు అసలే లేవు. సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టడం.. లేదా కథలు వండుకోవడం.. స్కైప్ ద్వారానో.. విడియో కాన్ఫరెన్స్ ద్వారానో కథలు వినడమే తప్ప ఏమీ చేయలేకుండా ఉన్నారు. సినిమాలు సెట్స్ మీద లేనివారు.. రిలీజ్ కు రెడీగా సినిమాలు లేనివారు సరే కానీ మిగతా వారికి మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది.
ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ నష్టం చూస్తున్నవారిలో దిల్ రాజు ముందువరుసలో ఉన్నారట. ఎందుకంటే రాజుగారి చేతిలో థియేటర్లు ఉన్నాయి. అవి మూత పడడంతో లీజ్ కట్టాల్సి వస్తోంది.. మెయింటెనెన్స్ కూడా పెట్టాల్సి వస్తోంది కానీ రెంట్ మాత్రం చేతికి అందడం లేదు. థియేటర్ లు ఎప్పటికి తెరుస్తారో.. అప్పటి వరకూ ఈ నష్టం తప్పదు. థియేటర్లు కంట్రోల్ చేస్తున్న మరో ముగ్గురు బడాబాబులకు కూడా నష్టం తప్పడం లేదట.
ఇక రాజు గారి ప్రొడక్షన్ విషయానికి వస్తే నాని-సుధీర్ బాబు సినిమా 'V' మార్చ్ 25 న రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు లాక్ డౌన్ పీరియడ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' షూటింగ్ కూడా వాయిదా పడింది. దీంతో వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు లేనట్టే. ఈ సినిమాలు ఎంత డిలే అయితే రాజుగారికి ఇంట్రెస్ట్ నష్టమే. మిగతా నిర్మాతలతో పోలిస్తే రాజుగారే ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఉన్నారని దీంతో రిస్క్ ఆయనకే ఎక్కువ అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎలా బయటకు వస్తారో వేచి చూడాలి.