Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి క‌బురు!

By:  Tupaki Desk   |   27 Dec 2022 11:30 AM GMT
కొత్త ఏడాది ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి క‌బురు!
X
ర‌కుల్ ప్రీత్ సింగ్- జాకీ భ‌గ్నానీ కొన్నాళ్ల‌గా ప్రేమ ఆస్వాద‌న‌లో మునిగితేలుతోన్న సంగ‌తి తెలిసిందే. విదేశీ వెకేష‌న్స్ మొద‌లుకుని సెల‌బ్రిటీల పెళ్లిళ్ల వ‌ర‌కూ దొరికిన ఏ వేదిక‌ని విడిచిపెట్ట‌డం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ స‌మ‌యం దొరికితే పార్టీలు..ప‌బ్ లు..మాల్దీవుల టూర్లు అంటూ చిలౌట్ అవుతున్నారు. ర‌కుల్ ప్రేమ‌లో ప‌డ‌టంకూడా ఇదే తొలిసారి. దీంతో వీలైనంత స‌మ‌యాన్ని ప్రియుడితో ఆస్వాద‌న‌కే కేటాయిస్తోంది.

ఓ వైపు సినిమా ల‌తో బిజీగా ఉన్నా..దొరికిన‌ ఏ క్ష‌ణాన్ని వ‌దిలిపెట్ట‌డం లేదు. ఉన్న‌ది ఒక్క‌టే జీవితం..అది ఎంజాయ్ చేయ‌డానికే అన్నంత‌గా చిలౌట్ మూవ్ మెంట్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఇటీవ‌లే త‌మ బాండింగ్ గురించి అధికారికం చేసేసారు. ఇటీవ‌లే ప్రియుడు స‌మ‌క్షంలో పుట్టిన రోజు వేడుకలు సైతం జరుపుకుని త‌మ మ‌ద్య బంధం ఎంత‌గా పెన‌వేసుకుపోయిందో చెప్ప‌కనే చెప్పారు.

క్రిస్మ‌స్ సంర‌ద్భంగా జాకీని ఉద్దేశించి శాంటా ఇచ్చిన గిప్ట్ గా చెప్పుకొచ్చింది. ఈనేప‌థ్యంలో జంట కొత్త ఏడాది త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లెక్క‌డానికి రెడీ అవుతున్న‌ట్లు మీడియా లో క‌థ‌నాలు గుప్పుమంటున్నాయి. ఇవ‌న్నీ పెళ్లికి ముందొస్తుత సంకేతాలు అంటూ ప్ర‌చారం సాగుతోంది.

ఏడాది ఆరంభంలోనే జంట వివాహ బంధంతో ఒక‌టి కానున్నార‌ని...విష‌యం ఇరు కుఉటం స‌భ్యుల‌కు తెలియ‌డం స‌హా ముహుర్తాలకు మంచి రోజులు ఎప్పుడ‌ని వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు బాలీవుడ్ లో మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ఏది ఏమైనా వ‌చ్చే ఏడాది ర‌కుల్ పెళ్లి క‌బురు చెప్ప‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది.

ఇక ర‌కుల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జెట్ స్పీడ్ తో బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అంతే వేగంగానూ అవి రిలీజ్ కి వ‌స్తున్నాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద సౌండింగ్ మాత్రం వినిపించ‌లేదు.

ఈ ఏడాది అమ్మ‌డు న‌టించిన కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ స‌క్సెస్ అవ్వ‌లేదు. మ‌రి న్యూ ఇయ‌ర్ లోనైనా విజ‌య బావుటా ఎగ‌ర వేస్తుందేమో చూడాలి. అలాగే బ్యూటీ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న 'భార‌తీయుడు-2' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.