Begin typing your search above and press return to search.
మహేష్ ఫ్యాన్స్.. జనవరి 1కి రెడీ అవ్వండి
By: Tupaki Desk | 15 Dec 2016 5:00 PM ISTఎనిమీ.. అభిమన్యు.. గూఢచారి.. ఏజెంట్ శివ.. ఇలా ఎన్నెన్ని టైటిళ్లు వినిపించాయో మహేష్ కొత్త సినిమా విషయంలో. చివరగా ఇప్పుడు ‘సంభవామి’ అనే పేరు తెరమీదికి వచ్చింది. ఇంతకుముందు వినిపించిన టైటిళ్లతో పోలిస్తే.. ‘సంభవామి’ టైటిల్ కు కొంచెం అథెంటిసిటీ ఉంది. ఈ చిత్ర నిర్మాతలు ఈ పేరును ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించడంతో ఇదే ఫైనల్ కావచ్చన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే నిజంగా ఈ సినిమాకు ఏ టైటిల్ పెడుతున్నారన్నది మాత్రం జనవరి 1నే తేలనుంది. ఆ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. అప్పుడే టైటిల్ కూడా ప్రకటించబోతున్నారు.
మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో సాగుతుందంటున్నారు. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడమే కాదు.. ఆ పాత్ర కోసం సిక్స్ ప్యాక్ కూడా చేయడం విశేషం. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా చేస్తోంది. జనవరి 1న ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి.. జనవరి 26న టీజర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటికల్లా సినిమా కూడా దాదాపుగా పూర్తి కావస్తుందని సమాచారం. ప్రస్తుతం అహ్మదాబాద్ లో నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నాడు మురుగదాస్. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/