Begin typing your search above and press return to search.

మాజీ గాళ్‌ ఫ్రెండ్స్‌కు ఫోజులిస్తున్నాడా

By:  Tupaki Desk   |   16 July 2015 10:49 PM GMT
మాజీ గాళ్‌ ఫ్రెండ్స్‌కు ఫోజులిస్తున్నాడా
X
కొత్త పెళ్ళికొడుకు పొద్దెరుగడు.. అనేది పాత సామెత. ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యిందంటే తన వైఫ్‌ ను ఊరంతా చూపించకపోతే మన పెళ్ళికొడుకులకు కిక్కు రావట్లేదు. అందరి సంగతేమో కాని, బాలీవుడ్‌ రాయుడు షాహిద్‌ కపూర్‌ మాత్రం ఈ స్ట్రాటజీకే స్టిక్‌ అయ్యి ఉన్నాడు. మనోడు తన కలల సుందరి మీరా రాజ్‌పుత్‌తో కలసి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

ఢిల్లీలో పెళ్ళిచేసుకుని ఇప్పుడు ముంబయ్‌లో కలసే మకాం ఉంటున్న షాహీద్‌, మీరా లు బొంబాయ్‌లో ఎక్కడ చూసినా మేమే అన్నట్లు దర్శనమిస్తున్నారు. చివరకు జిమ్‌కు వెళ్ళినా కూడా షాహీద్‌తో పాటు మీరా కూడా వచ్చేస్తోంది. షామిద్‌ జిమ్‌ చేస్తున్నాడంటే ఓకె కాని, అసలు మీరా పర్సనాలిటీకి జిమ్‌ ఏంటండీ బాబూ అనుకుంటున్నారు జనాలు. అయితే ఈ వేషాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

షాహీద్‌ గతంలో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ వంటి భామలతో ప్రేమాయణం నడిపాడు. తరువాత ఆ భామలు మనోడ్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి సోలోగానే ఉంటున్న షాహీద్‌ ఇన్నాళ్ళకు తనకంటే ఓ పదేళ్లు చిన్నదైన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. మరి తన మాజీ గాళ్‌ ఫ్రెండ్స్‌కు ఫోజులు కొడుతున్నాడో ఏమో కాని.. రెచ్చిపోతున్నాడంతే. ఈ ఇద్దరూ వైఫ్‌ అండ్‌ మొగుడులా కాకుండా లవ్‌ బర్డ్స్‌లా ఉన్నారు.