Begin typing your search above and press return to search.

ఆది, నిక్కి బ్యూటీఫుల్‌ ఎంగేజ్డ్‌ మూమెంట్స్

By:  Tupaki Desk   |   29 March 2022 9:30 AM GMT
ఆది, నిక్కి బ్యూటీఫుల్‌ ఎంగేజ్డ్‌ మూమెంట్స్
X
తమిళ హీరో కమ్‌ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆది పినిశెట్టి గత కొన్నాళ్లుగా కన్నడ బ్యూటీ హీరోయిన్‌ నిక్కీ గర్లానీ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇద్దరు కూడా ప్రేమ విషయమై బహిర్గతం అయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇద్దరు కలిసి పార్టీలకు, పబ్‌ లకు అంటూ పెద్దగా తిరగలేదు. అప్పుడప్పుడు తమిళ మీడియా ల్లో వీరి ప్రేమ గురించి కథనాలు వచ్చాయి తప్ప ఎక్కువ చర్చ అయితే జరగలేదు.

వీరిద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయం పై క్లారిటీ వీరి ఎంగేజ్మెంట్‌ వరకు కూడా రాలేదు. ఇద్దరు ఎంగేజ్మెంట్‌ చేసుకుని అప్పుడు తాము ఇన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాము అంటూ చెప్పకనే చెప్పారు. ఆది మరియు నిక్కీ గర్లానీ ల ఎంగేజ్మెంట్‌ సన్నిహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. ఇద్దరు లైట్‌ కలర్‌ డ్రస్ ల్లో అత్యంత అందంగా కనిపిస్తున్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

నిక్కీ ఇప్పుడు ఎంగేజ్మెంట్‌ వీడియోను షేర్‌ చేసింది. వీడియో లో ఇద్దరు కూడా చాలా క్యూట్‌ గా మేడ్‌ ఫర్‌ ఈచ్ అదర్‌ అన్నట్లుగా కనిపిస్తున్నారు. వావ్‌ ఇద్దరికి ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో ఇద్దరి యొక్క పెళ్లి గెటప్‌ గురించి కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరికి కూడా పెళ్లి కళ వచ్చింది. ఇద్దరు కూడా నిశ్చితార్థం లో చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.

ఇక ఆది తో పోల్చితే నిక్కీ కాస్త అల్లరిగా కనిపించింది. దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టడం మొదలుకుని ఉంగరం చూపిస్తూ కొంటెగా నవ్వడం వరకు వీడియో లో బ్యూటీఫుల్‌ మూమెంట్స్ ను చక్కగా క్యాప్చర్ చేశారు. కేవలం ఒకటిన్నర నిమిషం వీడియో తో వావ్‌ అనిపించేలా.. మొత్తం ఎంగేజ్మెంట్‌ ను చూపించి క్రియేటర్ సక్సెస్ అయ్యాడు అనడంలో సందేహం లేదు.

ఇక ఆది సినిమాల విషయానికి వస్తే తమిళంలో వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు తమిళం మరియు తెలుగు లో విలన్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఆది ప్రస్తుతం శంకర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా ఆది విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే నటించాలి అనుకోకుండా ఇలా విభిన్నమైన పాత్రలను చేసేందుకు సిద్ధం అవ్వడం అభినందనీయం.