Begin typing your search above and press return to search.
సమంత తరహాలోనే ఐశ్వర్య రజినీకాంత్
By: Tupaki Desk | 22 March 2022 11:30 PM GMTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుని విడి పోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇద్దరి మద్య ఎంతో అన్యోన్యత ఉండేది. ఏ కారణాల వల్ల విడి పోయారు అనేది వారికి తప్ప ఎవరికి తెలియదు. వారు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలంటే విడి పోవడం కరెక్ట్ నిర్ణయంగా భావించి విడి పోయారు. ఆ విషయంలో వారి అభిమానులు వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఉన్నారు.
నాగ చైతన్య నుండి విడి పోయిన తర్వాత సమంత ఢీ లా పడి పోకుండా.. జీవితం ముగిసింది అనే భావనలోకి వెళ్లి పోకుండా తన సినిమాల జోరు పెంచింది. చైతూ కు భార్యగా ఉన్న సమయంలో ఆమెకు ఖచ్చితంగా బాధ్యతలు.. ఒక రకమైన కట్టుబాట్లు ఉంటాయి. ఆ విషయంలో సందేహం లేదు. వాటికి తగ్గట్లుగా ఉండటంతో పాటు వాటికి గౌరవం ఇస్తూ సమంత వ్యవహరించింది. చైతూ నుండి విడి పోయాక హీరోయిన్ గా సమంత బిజీ అయ్యింది.
తెలుగు.. తమిళ సినిమాలతో పాటు హిందీలో సినిమాలు మరియు సిరీస్ లు అంటూ బిజీ బిజీగా అయ్యింది. మళ్లీ కెరీర్ ఆరంభంలో ఎంత బిజీ గా అయితే సమంత మారిందో ఇప్పుడు అదే తరహా లో సమంత మారింది. సమంత సినిమాల్లో పడి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడి దొడుకులను ఎలా అయితే ఎదుర్కొంటుందో అలాగే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా తన విడాకుల విషయం నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ధనుష్ తో సంసార జీవితాన్ని సాగించిన ఐశ్వర్య ధనుష్ కొన్ని కారణాల వల్ల విడి పోయారు. వారి విడాకుల విషయంలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్ ఆ విషయం నుండి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఐశ్వర్య వర్క్ తో బిజీ అయ్యింది.
ఇటీవలే ఒక మ్యూజిక్ ఆల్బమ్ కు దర్శకత్వం వహించి విడుదల చేసిన ఈమె తాజాగా బాలీవుడ్ సినిమా కు రెడీ అయ్యింది. ఇప్పటికే తమిళంలో డైరెక్షన్ చేసిన ఈమె ఇప్పుడు హిందీ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యింది. విడాకులు తీసుకున్న తర్వాత ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ధనుష్ తో ఇంకా స్నేహం కొనసాగుతున్నట్లుగా ఇటీవల నిరూపితం అయ్యింది. కనుక తండ్రి మరియు ధనుష్ ల ప్రోత్సాహంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అయ్యిందనే ప్రచారం మొదలు అయ్యింది. 'ఓ సాతి చల్..' అనే సినిమా తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నట్లుగా ఐశ్వర్య ప్రకటించింది. ఒక మంచి ప్రేమ కథను ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా ఆమె తెలియజేసింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.