Begin typing your search above and press return to search.

పెళ్లి వేళ ఆలియా-ర‌ణ‌బీర్ ఎడ‌బాటు ఏల‌?

By:  Tupaki Desk   |   10 April 2022 3:30 AM GMT
పెళ్లి వేళ ఆలియా-ర‌ణ‌బీర్ ఎడ‌బాటు ఏల‌?
X
ర‌ణ‌బీర్ - ఆలియా భ‌ట్ జంట పెళ్లికి బాజాలు మోగే వేళాయెను! ఇప్ప‌టికే ప్రిప‌రేష‌న్స్ జోరందుకున్నాయి. ఈ పెళ్లికి అతికొద్దిమంది బంధుమిత్రులు మాత్ర‌మే హాజ‌ర‌వుతార‌ని ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ప్ర‌త్యేకించి విందు కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వచ్చాయి.

ఇప్ప‌టికే బాంద్రాలో ఆలియా ఇంట పెళ్లి స‌న్నాహాలు సాగుతుండ‌గా.... వరుడు రణబీర్ కపూర్ గుర్ గావ్ లో ఉంటున్నాడని స‌మాచారం. దీంతో అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి త‌ర‌హాలో ఒక‌రికొక‌రు దూరంగా ఉంటున్నారు అనేది టాక్.

రణబీర్ కపూర్- అలియా భట్ ల పెళ్లి చర్చనీయాంశమైంది. ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌వుతున్నార‌ని టాక్ ఉంది. అయితే మరికొందరు ఏప్రిల్ 17న పెళ్లాడుతార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ పెళ్లి తేదీ గురించి లీక్ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఇలా ఎవ‌రికి వారు గెస్సింగుల్లో ఉన్నారు.

కపూర్ కుర్రాడు ప్రస్తుతం గుర్ గావ్ లోని ఆరే కాలనీలో ఉంటున్నాడు. లవ్ రంజన్ తో ప్ర‌స్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత రెండు రోజులుగా రణబీర్ హోటల్ వెస్టిన్ లో ఉంటున్నట్లు నటుడికి సంబంధించిన‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తాజా వివ‌రాల ప్ర‌కారం.. వివాహానికి ముందు తరువాత ర‌ణ‌బీర్ కి కెరీర్ ప‌రంగా కొన్ని ఒప్పందాలున్నాయి. అందుకే మమ్మీ డియరెస్ట్ నీతూ కపూర్ .. కాబోయే వధువు అలియా భట్ తమ బాంద్రా నివాసంలో వివాహాదీ కార్య‌క్ర‌మాల‌ను న‌డిపించేస్తున్నారు.

పెళ్లి తర్వాత రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా తో `యానిమల్` చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించేందుకు ఈ నెలాఖరులోగా హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాలని భావిస్తున్నారు. అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షెడ్యూల్ ను ఇప్ప‌టికే ముగించింది. వచ్చే వారం పెళ్లి కాబ‌ట్టి ఇప్ప‌టికి ఆమె తనను తాను ఖాళీగా ఉంచుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అలియా భట్ - రణ్‌బీర్ కపూర్ లు న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `బ్రహ్మాస్త్ర` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇందులో భార్యాభర్తలుగా న‌టించారు.

ఏప్రిల్ 17న ముంబై తాజ్ ప్యాలెస్ లో విందు

ఏప్రిల్ 17న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో రణబీర్ కపూర్ & అలియా భట్ వివాహ రిసెప్షన్ జరగనుందా? అంటే అవున‌నే స‌మాచారం. ఏప్రిల్ 15 న అంగ‌రంగ వైభ‌వ‌ వివాహం తర్వాత రణబీర్ కపూర్ - ఆలియా భట్ ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో తమ పరిశ్రమ స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు. రిసెప్షన్ పార్టీ 5-నక్షత్రాల హోటల్ బాల్ రూమ్ లో రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. రణబీర్ కి సన్నిహితంగా ఉన్న ఓ సోర్స్ ఈ వివ‌రాల్ని వెల్లడించింది. ఏప్రిల్ 17న తాజ్ మహల్ ప్యాలెస్ లో రిసెప్షన్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది. గత రాత్రి అలియా భట్ మరియు రణబీర్ కపూర్ తమ వివాహ రిసెప్షన్ కోసం హై-ఎండ్ సీఫ్రంట్ హోటల్ ను బుక్ చేసుకున్నార‌ని తెలిసింది.

ప్రేమపక్షులు విందుకు ఎవ‌రిని పిల‌వాలో కూడా డిసైడ్ చేసుకున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా- హృతిక్ రోషన్ నుండి కత్రినా కైఫ్ నుండి రాణి ముఖర్జీ వరకు బాలీవుడ్ లో ఎవరినీ వ‌దిలిపెట్ట‌కుండా గ్రాండ్ రిసెప్షన్ కోసం ఆహ్వానిస్తారు. పరిశ్రమలోని దాదాపు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పంపిస్తారు.

కపూర్ మెహందీ వేడుకతో పాటు చెంబూర్ లోని ఆర్‌కె హౌస్ లో మాతా కీ చౌకీ.. చిన్న పూజతో వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాగే ఏప్రిల్ 30న దివంగత రిషి కపూర్ 2వ వర్ధంతి సందర్భంగా పూజలు నిర్వహించనున్నారు.