Begin typing your search above and press return to search.
`మారేడుమిల్లి ప్రజానీకంలో` అల్లరి నరేష్
By: Tupaki Desk | 10 April 2022 5:30 AM GMT`మహర్షి` సక్సెస్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. నరేష్ లీడ్ రోల్ లో వరుసగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. `బంగారు బుల్లోడు`..`నాంది` లాంటి చిత్రాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా నరేష్ వేగం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. నరేష్ 59వ చిత్రం రాజ్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం` అన్నది సినిమా టైటిల్ గా ఖరారు చేసారు. పోస్టర్ డిజైన్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. `పీపూల్ ఆర్ ది ఎజెండా` అన్న పాయింట్ సినిమాలో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోది. యానిమేటెడ్ కార్టూన్ పోస్టర్ లో గుంపుగా జనం కనిపిస్తున్నారు.
తమలోని ఐక్యమత్యాన్ని చాటి చెబుతున్నట్లు కనిపిస్తుంది. పోస్టర్ లో ఒక్కొక్కరు గునపం..పలుగు..పార..కత్తి పట్టుకుని శత్రువులపై ఐక్యమత్యంగా పోరాటానికి దిగినట్లు కనిపిస్తుంది. పోస్టర్ డిజైన్..టైటిల్ ని బట్టి ఇది పూర్తిగా అల్లరి నరేష్ గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో నరేష్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది? అన్న క్యూరియాసిటీ మొదలైంది. `మహర్షి` లో నరేష్ పాత్రలో సీరియస్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
అప్పటి వరకూ కమెడియన్ గా మెప్పించిన నరేష్ ఒక్కసారిగా సీరియస్ డిఫరెంట్ గా ఉద్యమ నాయకుడి పాత్రలో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తాజా సినిమా ప్రచారం చూస్తుంటే నరష్ రోల్ `మహర్షి`ని పోలి ఉంటుందా? అన్న సందేహం తెరపైకి వస్తోంది. కాగా మరికొంత మంది నరేష్ మార్క్ ఎంటర్ టైనర్ అని డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు అని అంటున్నారు.
మరి ఇందులో ఏది నిజం అన్నది యూనిట్ రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు. ఇందులో నరేష్ కి జోడీగా ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మిస్తోంది. మరోవైపు అల్లరి నరేష్ `సభకు నమస్కారం` అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమా షూటిల్లో బిజీగా ఉన్నాడు.