Begin typing your search above and press return to search.
ముగ్గురు బ్రదర్స్ కి వీకెండ్ రిసార్ట్..?
By: Tupaki Desk | 31 March 2022 10:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అల్లు శిరీష్ లకు అన్నగారు అల్లు బాబి. ఆయన ఇటీవల నిర్మాతగా బిజీ అయ్యారు. నటుడిగానూ ఓ సినిమాలో కనిపించనుండడం ఆసక్తిని కలిగించింది. ఇకపోతే బాబీ కి ఒక డ్రీమ్ ఉండేది. తమ ముగ్గురు సోదరులు కలిసి ఒక రిసార్ట్ లో రిలాక్స్ అయ్యేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో రిసార్ట్ నిర్మించాలని అనుకున్నారట.
హైదరాబాద్ ఔటర్ లో ఉన్న 11 ఎకరాల తోటలో దీనిని నిర్మించాలనుకున్నారు. కానీ వీలుపడలేదు. కాలక్రమంలో హైదరాబాద్ వేగంగా విస్తరించేయడం తమ స్థలం చుట్టూ ఏకంగా హై ఎండ్ భవంతులు నిర్మించి కమర్షియల్ స్పేస్ గా మార్చేయడంతో ఆ తర్వాత అదే స్థలంలో స్టూడియోని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిలిం స్టూడియో నిర్మాణంలో ఉంది. దీనివల్ల సమీపంలోని టెక్నీషయన్లకు సౌకర్యంగా ఉంటుందని వారు కూతవేటు దూరంలో అన్ని సదుపాయాల్ని అందిపుచ్చుకోవచ్చని ఇలా ప్లాన్ చేశామని ప్రముఖ మీడియాకు బాబి తెలిపారు.
తాను పరిచయం చేసిన క్యూబ్ సిస్టమ్ .. టికెట్ దాదా గురించి కూడా ఆయన మాట్లాడారు. తొలిగా పరిచయం చేసేది తనకు కిక్కిస్తుందని బాబి అన్నారు. నిజానికి 11 ఎకరాల స్థలం కొన్నపుడు స్టూడియో ఆలోచనే లేదట. సిటీకి దూరంగా ఉంది కాబట్టి అక్కడ రిసార్ట్ అయితేనే బావుంటుందనుకున్నారట.
ఇక్కడ కనీసం వృద్ధుల కోసం ఆయుర్వేదిక్ రిసార్ట్ కమ్ వెల్ నెస్ సెంటర్ నిర్మించాలని కూడా అనుకున్నా ఆ తర్వాత డ్రాప్ అయ్యి స్టూడియో నిర్మిస్తున్నారు. ఆసక్తికరంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల తన ఖరీదైన కోకాపేట భూముల గురించి ప్రస్థావించారు. ఇందులో తన చెల్లెళ్లకు వాటా ఇవ్వాలని వదినమ్మ అయిన శ్రీమతి సురేఖ తనను అడగడం ఆశ్చర్యపరిచిందని అన్నారు.
ఔటర్ లో చిరు ఏం నిర్మిస్తారు? అల్లూ స్టూడియోలానే!? ఏదైనా నిర్మిస్తారా? అంటే ఇంతకుముందు దీనిగురించి చాలా చర్చ సాగింది. కానీ దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతానికి కోకాపేట భూముల్లో సెట్లు నిర్మించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసినదే