Begin typing your search above and press return to search.
'రావణాసుర'నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. గట్టెక్కేనా?
By: Tupaki Desk | 29 March 2022 7:30 AM GMTఅను ఇమ్మాన్యుయేల్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అందాల సోయగం చదువుకుంటున్న రోజుల్లోనే `స్వప్న సంచారి` అనే మలయాళ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇదే ఆమె తొలి సినిమా. `యక్షన్ హీరొ బిజు` సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారిన అను ఇమ్మాన్యుయేల్.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా 2016లో వచ్చిన `మజ్ను` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఈ మూవీ ఘన విజయం సాధించకపోయినా.. అను నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం ఇలా వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, ఇవేమి ఆమెకు సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి. పైగా అను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో.. ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోయింది.
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు `రావణాసుర`నే నమ్ముకుంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `రావణాసుర`. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ కెరీర్‌లో 70వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.
ఇందులో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అను ఇమ్మన్యూయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, దక్షా నగర్కార్ హీరోయిన్లుగా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అను ఇమ్యాన్యుయేల్ తన ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకుంది. ఇది గనుక హిట్టైతే ఆమె మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఆమె కెరీర్ పూర్తిగా డల్ అయిపోతుంది. మరి `రావణాసుర`తో అయినా అను గట్టెక్కుతుందా..? లేదా..? అన్నది చూడాలి.