Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బాలయ్య పక్కన ఉన్న ఈమెను గుర్తు పట్టగలరా?

By:  Tupaki Desk   |   31 March 2022 4:30 AM GMT
ఫోటోటాక్ : బాలయ్య పక్కన ఉన్న ఈమెను గుర్తు పట్టగలరా?
X
నందమూరి బాలకృష్ణ ను చినప్పటి నుండి వెండి తెరపై చూస్తున్నాం కనుక ఆయన్ను ఏ రూపంలో ఉన్నా గుర్తు పట్టేస్తారు.. ఆయన ఎంత మందిలో ఉన్నా ఈజీగా అందరు గుర్తు పట్టగలరు. కాని ఈ ఫోటోలో ఆయన పక్కన ఉన్నది ఎవరు అంటే ఠక్కున చాలా మంది గుర్తించలేరు. ఎందుకంటే ఈ ఫోటో దాదాపుగా 35 ఏళ్ల క్రితం తీసిన ఫోటో. ఈ ఫోటోలో బాలయ్య ను ఈజీగా గుర్తు పట్టినా.. ఆమెను గుర్తించేందుకు కాస్త సమయం కావాలి.

ఆమెను గుర్తించండి అంటే చాలా మంది ఎంత సమయం తీసుకున్నా గుర్తించడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు. ఆమె మరెవ్వరో కాదు.. బాలయ్య బాబు గారి ధర్మపత్ని వసుందర. పెళ్లి అయిన కొత్తలో తీసుకున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అప్పటికే నటుడిగా తనదైన శైలిలో వెండి తెరపై వెలుగు వెలుగుతున్న బాలయ్య పక్కన అప్పట్లో వసుందర గారు హీరోయిన్ మాదిరిగా ఉన్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి.

బాలకృష్ణ మరియు వసుందర ల యొక్క పెళ్లి నాటకీయ పరిణామంలో జరిగిందని అంటారు. బాలకృష్ణ ను సినిమాలో చూసి నచ్చి పెళ్లికి సిద్దం అయ్యారు అనేది టాక్‌. ఇక బాలయ్య మరియు వసుందర ల అన్యోన్య దాంపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిల పెళ్లిలు అయ్యి వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

ఇక అబ్బాయి మోక్షజ్ఞ ను వెండి తెరకు పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నారు. 2025 సంవత్సరంలో ఖచ్చితంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై బాలయ్య మరో సారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తన కొడుకు తో కలిసి ఖచ్చితంగా నటిస్తాను అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ ప్రకటించడంతో ఆ సందర్బం కోసం నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

బాలయ్య ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. గోపీచంద్‌ తో మూవీ పూర్తి అయిన వెంటనే ఎఫ్‌ 3 చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు బాలయ్య ఓకే చెప్పాడు. గత ఏడాది చివర్లో అఖండ సినిమా తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లను దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.