Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ : థాంక్ యూ జ‌గ‌న్ థాంక్ యూ చిరు

By:  Tupaki Desk   |   25 March 2022 4:00 AM GMT
ఆర్ఆర్ఆర్ : థాంక్ యూ జ‌గ‌న్ థాంక్ యూ చిరు
X
గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఆర్.. హిట్ కొట్టింది.దీంతో రాజ‌మౌళి పేరు మ‌రోసారి మార్మోగిపోతోంది. ఈ సినిమా విష‌య‌మై మూడేళ్లు వెచ్చించి కృషి చేసిన తార‌క్ కానీ చ‌ర‌ణ్ కానీ మ‌రో సినిమా విష‌య‌మై ఆలోచించుకోవ‌చ్చు..ఇక ఇక్క‌డితో ఈ క‌థ వ‌దిలి కొత్త క‌థ వెతుక్కోనూ వ‌చ్చు..మ‌ళ్లీ వీలుంటే వారిద్ద‌రూ క‌లిసి న‌టించ‌నూవ‌చ్చు..అంత గొప్ప‌గా ఉన్నారిద్ద‌రూ.. స్నేహానికి కొత్త అర్థం చెప్పారు వీరిద్ద‌రూ..ద‌టీజ్ తారక్ ..ద‌టీజ్ చ‌ర‌ణ్ .. ద‌టీజ్ రాజ‌మౌళి..ఇదే సంద‌ర్భంలో చిత్రం విడుద‌ల‌కు ప్ర‌ధాన అడ్డంకిగా ఉన్న టికెట్ రేట్ల విష‌య‌మై అటు తెలంగాణ ప్ర‌భుత్వంతోనూ ముఖ్యంగా ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రితోనూ మాట్లాడి, ఎప్ప‌టికిప్పుడు ఇండ‌స్ట్రీ స్థితిగ‌తులను వివ‌రించి వారిని ఒప్పించారు చిరు.

ఆ విధంగా చిరు గ్రేట్.. మెగాస్టార్ గ్రేట్.. అనండిక స్టార్ స్టార్ మెగాస్టార్ అని! ఆ మాట జ‌క్క‌న్న ఒప్పుకున్నారు.ఇంకా ఇండ‌స్ట్రీలో చాలా మంది ఒప్పుకోవాలి..ఒప్పుకునేందుకు పాపం కొంద‌రికి ఇష్టం లేక‌పోయినా ఒప్పుకునే తీరాలి. ఇండ‌స్ట్రీ ఇవాళ ఆనందిస్తోంది..ఒక సినిమా ఓ ప్ర‌భంజ‌న శ‌క్తిగా మారేందుకు స‌హ‌క‌రించిన చిరంజీవికి వంద‌నాలు చెబుతోంది.. అనండిక జై చిరంజీవా ! అని !

ఇండ‌స్ట్రీ అంతా ఏవేవో మాట‌లు అంటోంది. విని న‌వ్వుకున్నాడు చిరు.సీఎం జ‌గ‌న్ ను క‌లిసి భోజ‌నం చేసి వ‌చ్చారా మీరు అని ఏవేవో మాటాలు అంది..విని న‌వ్వుకున్నారు చిరు.. అన్న‌య్య‌ను ఎంద‌రు ఎన్ని మాట‌లు అన్నా కూడా చాలా మంది మాట్లాడ‌లేదు. పైకి కూడా చిరుకు మ‌ద్ద‌తు ఇస్తూ మాట్లాడ‌లేదు. మాట వ‌రుస‌కు కూడా కొంద‌రు అగ్ర హీరోలు మాట్లాడ‌లేదు. కానీ చిరు వాటిని ప‌ట్టించుకోలేదు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ర్ తో నేను మాట్లాడాను మీరు అంతా అనుకున్న రీతిలో శుభ‌వార్త వ‌స్తుంది అని మాత్ర‌మే చెప్పారు. అందుకు జ‌గ‌న్ అందుకు పేర్ని నాని ఇంకా అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. మీరు మా ఇంటికి రండి భోజ‌నం చేసి వెళ్లండి..మీరు మా అతిథి అని జ‌గ‌న్ దంప‌తులు చిరును ఆహ్వానించిన తీరే గొప్ప‌ది. ఇప్పుడు ఈ సినిమా హిట్ కానీ ఆ ఒక్క‌డి క‌ష్టం గురించి మాట్లాడండి ప్లీజ్.

మాట్లాడాల్సింది ఒక్క జ‌క్క‌న్న (రాజ‌మౌళి) మాత్ర‌మే కాదు. మాట్లాడాల్సింది తార‌క్ కూడా ! మాట్లాడి వంద‌నాలు చెల్లించాల్సింది మహేశ్ కూడా ! మాట్లాడి కృత‌జ్ఞ‌త‌లు చెల్లించాల్సింది ప్ర‌భాస్ కూడా ! పాపం ! త‌మ్ముడి ఏమీ మాట్లాడ‌లేదు. అన్న‌య్య ఇండ‌స్ట్రీ కోసం వెళ్లారు..వెళ్ల‌నివ్వండి అని చెప్పిన ప‌వ‌న్ కు కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి మీరంతా! ఒక్క మాట‌లో చెప్పాలంటే యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ కూడా జ‌గ‌న్ స‌ర్ ను ఒప్పించ‌లేక‌పోయింది కానీ చిరు మాత్రం త‌న దైన శైలిలో వెళ్లి మాట్లాడి ఒప్పించి వ‌చ్చారు. ఆయ‌న లేకుండా ఆయ‌న ప్రొద్బ‌లం కానీ చొర‌వ కానీ లేకుండా ఉంటే ఇవాళ రివైజ్డ్ జీఓ రానే రాదు. అందుకు త‌గ్గ చొర‌వ చూపించి త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేసి స‌ఫ‌లీకృతం అయిన చిరు ఇవాళ రియ‌ల్ స్టార్..అలానే వీరి ఇబ్బందులు గుర్తించి రివైజ్డ్ జీఓ ఇచ్చిన జ‌గ‌న్ కు కూడా ఓ కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాద.