Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: కొండగుట్టల్లో గురు-శిష్యుల పోరాటం?
By: Tupaki Desk | 12 April 2022 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 152వ చిత్రంగా రూపొందుతుంది. ఎంతో మంది మేకర్లని పరిశీలించి ఆ బాధ్యతల్ని కొరటాలకు అప్పగించారు. ఇప్పటికే సినిమా కంటెంట్ పై క్యూరియాసిటీ నెలకొన్న సంగతి తెలిసిందే.
చిరు..చరణ్ పోస్టర్లు ఆద్యంతం సస్పెన్స్ తో అభిమానుల బుర్రల్ని తొలిచేస్తున్నాయి. టీజర్ తోనే ఆ విషయం సుస్పష్టం అయింది. తండ్రి-తనయులిద్దరి సాయదు పోరాటం ఆద్యంతం ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కొరటాల వెండి తెరపై సరికొత్త మెగాస్టార్ ని ఆవిష్కరించబోతున్నరని అర్దమైంది. అటుపై రిలీజ్ అయిన టీజర్ అంతకంతకు అంచనాల్ని రెట్టింపు చేసింది.
పాఠాలు చెప్పే ఆచార్య కాదు గుణపాఠాలు నేర్పే ఆచార్యుడిని అని మెగాస్టార్ తనదైన శైలిలో చెప్పి మరింత ఎగ్టైట్ మెంట్ తీసుకొచ్చారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ బయటకు వచ్చింది. ఇందులో కొండగుట్టల్లో చిరింజీవి-చరణ్ తుపాకులు పట్టుకుని ఫోజులిచ్చారు. ఆ పక్కనే దర్శకుడు కొరాటాల శివ నుంచోని ఉన్నారు. దర్శకుడు యాక్షన్ సీన్ చెప్పగానే తండ్రీకొడుకులిద్దరు ఇలా ఒకే యాంగిల్ లో ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది.
చిరు..చరణ్ స్టిల్ లో..వెనుక గన్నులు పట్టుకుని నుంచుని ఉన్న గ్యాంగ్ ని చూస్తుంటే ఇదోక నకల్స్ గ్రూప్ లో కనిపిస్తుంది. సినిమాని ఆద్యంతం సాయుధ పోరాటం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వ్యవస్థపై తుపాకులు ఎక్కిపెట్టి సమాజ పోకడల్లో మార్పులు తీసుకొచ్చిన `ఆచార్య` సైన్యంగా గా కనిపిస్తుంది. కొరాటల మార్క్ సెన్సిబిల్ అంశాలతో ఆద్యంతం తెరకెక్కించారని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్..చరణ్ కి ఫెయిర్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశ్మర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తిచేసుకుని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.