Begin typing your search above and press return to search.

ఇదో సినిమాటిక్ రియల్ స్టోరీ.. బ్రేకప్ తర్వాత రెండోసారి ఎంగేజ్ మెంట్!

By:  Tupaki Desk   |   10 April 2022 4:32 AM GMT
ఇదో సినిమాటిక్ రియల్ స్టోరీ.. బ్రేకప్ తర్వాత రెండోసారి ఎంగేజ్ మెంట్!
X
బాలీవుడ్ లో లవ్వులు.. రిలేషన్ షిప్పులు చాలా కామన్. అదే టాలీవుడ్ కు వస్తే.. నిజంగానే లివింగ్ టుగెదర్ ఉన్నా.. ఆ విషయం అందరికి తెలిసినా.. వాటి గురించి మీడియాలో వార్తలుగా మార్చటానికి పెద్దగా ఇష్టపడరు. ఆ మాటకు వస్తే.. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ ప్రేమకథలు కాస్తంత గుట్టుగా సాగిపోతుంటాయి. ఇక.. హాలీవుడ్ విషయానికి వస్తే.. అక్కడి తార రియల్ జీవితాల ముందు..

అక్కడ కనిపించే కాంబినేషన్ల ముందు బాలీవుడ్ జుజుబి అన్నట్లు ఉంటుంది. ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో.. ఎప్పుడు బ్రేకప్ చేసుకుంటారో.. మళ్లీ ఇంకెప్పుడు కలిసిపోతారో క పట్టాన అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిందే.

తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటికే ఒకసారి ఎంగేజ్ మెంట్ చేసుకొని.. అనంతరం బ్రేకప్ చెప్పుకొని.. ఎవరి దారిన వారు ఉంటూ.. ఎవరికి వారు వేరే వారితో లవ్ ట్రాకులు నడిపి.. వాటికి బ్రేకప్ లు చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. ఒకప్పుడు విడిపోయిన హాలీవుడ్ జంట మళ్లీ కలవటం.. ఈ విషయాన్ని ఒప్పేసుకోవటంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లోపెజ్.. బెన్అఫ్లెక్ లు రెండోసారి విజయవంతంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

ఈ విషయాన్ని జెన్నిఫర్ స్వయంగా ఒక వీడియోలోవెల్లడించారు. అంతేకాదు.. సోషల్ మీడియా ఖాతాలో స్టోరీ రూపంలో అందరికి చెప్పేశారు. వీరి లవ్ స్టోరీ కాస్త భిన్నమైనది. రీల్ స్టోరీ మాదిరి బోలెడన్ని మలుపులు కనిపిస్తాయి వీరి లవ్ ట్రాక్ లో. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం జెన్నిఫర్ లోపేజ్.. బెన్ అఫ్లెక్ లు ఇద్దరూ కలుసుకొని.. ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అనంతరం రెండేళ్లు బాగానే ఉన్నారు. అనంతరం వారు తమ బంధానికి స్వస్తి పలికి.. ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఈ క్రమంలో జెన్నిఫర్ లోపేజ్ ఒకరిని పెళ్లాడితే.. బెన్ అఫ్లెక్ సైతం మరొకరిని పెళ్లాడారు. విచిత్రంగా ఈ రెండు జంటల వైవాహిక జీవితం అనుకున్నట్లుగా సాగలేదు. దీంతో రెండు జంటలు బ్రేకప్ చెప్పేసుకున్నాయి. అనంతరం జెన్నిఫర్ లోపేజ్.. బెన్ అఫ్లెక్ ఇద్దరూ మళ్లీ ఒకటయ్యారు. ఈ రెండు జంటలు గత ఏడాదిలో విడాకులు తీసుకోవటంతో.. వారికి ఇక అడ్డు లేకపోయింది. వీరిద్దరు కలిసి టూర్లు.. షికార్లు.. వర్కువుట్స్ తో పాటు.. పలు ఈవెంట్లకు కలిసి వెళ్లటం షురూ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓపెన్ అయ్యారు. తన లవ్ ను.. రెండోసారి ఎంగేజ్ మెంట్ చేసుకున్న తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మరి.. రెండోసారి ఎంగేజ్ మెంట్ కు రెఢీ అవుతున్న ఈ జంట పెళ్లి పీటల వరకు వెళుతుందా? మళ్లీ ఏదైనా ట్విస్టు ఎదురవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.