Begin typing your search above and press return to search.
నిబంధన ఉల్లంఘన.. నాగ చైతన్యకు జరిమానా
By: Tupaki Desk | 12 April 2022 4:34 AM GMTహైదరాబాద్ పోలీస్ కాఠిన్యం మరోసారి బయటపడింది. సెలబ్రిటీ సామాన్యుడు అనే విభేధం తమకు లేదని తాజాగా పోలీస్ అధికారులు నిరూపించారు. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్యకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. సోమవారం నాడు టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘించినందుకు నాగ చైతన్య కారుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.700 జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనం విండ్ స్క్రీన్ లపై ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు చైతన్య కారును ఆపారు. అక్కడ బ్లాక్ ఫిల్మ్ లు ఉన్న కార్లను తనిఖీ చేస్తుండగా చై కార్ పట్టుబడింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు చైతూపై కేసు నమోదు చేసి రూ.700 జరిమానా విధించారు. అనంతరం వెళ్లేందుకు అనుమతించినట్లు పోలీసులు తెలిపారు. నాగ చైతన్య కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తన 22వ సినిమాని త్వరలోనే ప్రకటించనున్నారు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
మనోజ్ .. బన్ని. కళ్యాణ్ రామ్ పైనా..!
ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నటుడు మంచు మనోజ్ ను ఇదే తీరుగా మార్గమధ్యంలో ఆపారు. హైదరాబాద్ టోలిచౌకి వద్ద అతని కారుపై ఉన్న టిన్టెడ్ గ్లాసెస్ నుండి బ్లాక్ ఫిల్మ్ ను తీసివేసి రూ. 700 జరిమానా విధించారు. ఇంతకుముందు అల్లు అర్జున్- కళ్యాణ్ రామ్ ల కార్లకు ఇదేవిధంగా జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కార్ ను ఆపి టింటెడ్ గ్లాసెస్ లోని బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి వారికి రూ.700 జరిమానా విధించారు. గత వారం రోజులుగా హైదరాబాద్ పోలీస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రంగు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.