Begin typing your search above and press return to search.

ఆఫ‌ర్ల కోసం రూటు మార్చిన ఇలియానా..ఇదైనా క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   4 April 2022 3:48 AM GMT
ఆఫ‌ర్ల కోసం రూటు మార్చిన ఇలియానా..ఇదైనా క‌లిసొచ్చేనా?
X
ఇలియానా.. ఈ గోవా బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ పోతినేని హీరోగా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వ‌చ్చిన `దేవ‌దాసు` చిత్రంతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది ఇలియానా. రామ్‌కు కూడా ఇదే తొలి చిత్రం. 2006లో విడుద‌లైన ఈ మూవీ సంచలనాత్మక విజయాన్ని న‌మోదు చేసి.. ఇలియానాకు మరిన్ని ఆఫ‌ర్లు వ‌చ్చేలా చేసింది. ఆ వెంట‌నే ఇలియానా మ‌హేష్ బాబుకు జోడీగా `పోకిరి` చేసింది.

ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇలియానా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. దాంతో ఇలియానా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ తిరుగులేని న‌టిగా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ఇలియానా.. కెరీర్ పిక్స్‌లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్‌కు మ‌ఖాం మార్చింది. కానీ, అక్క‌డ ఆమె కెరీర్ అంత సాఫీగా సాగ‌లేదు. వ‌రుస సినిమాలు చేసినా.. అవేమి ఇలియానాకు స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయాయి.

దాంతో సినిమాల‌ను ప‌క్క‌న పెట్టి లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణం న‌డిపించింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట‌.. ఆపై వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు. ప్రియుడితో బ్రేక‌ప్ అవ్వ‌డం, సినిమా ఆఫ‌ర్లు కూడా త‌గ్గిపోవ‌డంతో.. ఇలియానా డిప్రెష‌న్‌లోకి వెళ్లింది. బ‌రువు కూడా పెరిగిపోయింది. అయితే స‌న్నిహితుల ప్రోత్సాహంతో డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డిన ఇలియానా.. మ‌ళ్లీ ఫిట్‌నెస్‌పై శ్ర‌ద్ధ పెట్టి సినిమా ఆఫ‌ర్లు అందుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో ఎట్రాక్ట్ చేయాల‌ని చూస్తోంది. కానీ, ఆఫ‌ర్లు మాత్రం రావ‌డం లేదు. దీంతో ఇలియానా రూటు మార్చింది. ఒరిజిల్‌ ఆల్బమ్‌ సాంగ్‌ చేయడం స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా `ఊఊఊ.. `అంటూ సాగే సాంగ్‌లో న‌టించింది. కరణ్‌ ఆలపించగా.. కరణ్‌, సిద్ధేష్‌ పటోల్‌ లిరిక్స్‌ రాశారు. తాజాగా ఈ ఆల్బమ్‌ సాంగ్ కి సంబంధించిన లుక్స్ బ‌య‌ట‌కు రాగా.. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 6న బ‌య‌ట‌కు రానుంది. మ‌రి ఈ ఆల్బ‌మ్ సాంగ్ అయినా ఇలియానాకు క‌లిసొచ్చి.. సినిమా ఆఫ‌ర్ల‌ను తెచ్చిపెడుతుందో..? లేదో..? చూడాలి.