Begin typing your search above and press return to search.

ఇండిపెండెన్స్ పీరియ‌డ్ సినిమాల‌కు సెంటిమెంట్ గండం

By:  Tupaki Desk   |   24 March 2022 9:52 AM GMT
ఇండిపెండెన్స్ పీరియ‌డ్ సినిమాల‌కు సెంటిమెంట్ గండం
X
బ్రిటీష్ కాలం నాటి క‌థ‌ల‌తో తెర‌కెక్కిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బారీ విజ‌యాల్ని సాధించిన దాఖ‌లాలు లేవు. తెలుగుతో పాటు హిందీలోనూ అత్యంత భారీ స్థాయిలో స్వాతంత్య్ర స‌మ‌రం నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి. కానీ అందులో చాలా త‌క్కువ చిత్రాలు మాత్ర‌మే విజ‌యాల్ని సాధించాయి కానీ అత్య‌ధిక చిత్రాలు మాత్రం భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచి భారీ న‌ష్టాల‌ని అందించాయి. ఈ వ‌రుస‌లో హిందీ చిత్రాల‌తో పాటు తెలుగు చిత్రాలు కూడా చాలానే వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన `సుభాస్ చంద్ర‌బోస్‌`. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సి. అశ్వ‌నీద‌త్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. 1946 ప్రీ ఇండిపెండెన్స్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో వెంక‌టేష్ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభిన‌యం చేశారు. శ్రియా, జెనీలియా హీరోయిన్ లుగా న‌టించారు. క‌ర్నూలు స‌మీపంలోని ఓర్వ‌క‌ల్లులో ప్ర‌త్యేకంగా ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆశోక్ నేతృత్వంలో భారీ విలేజ్ సెట్ ని, బ్రిటీష్ వారికి సంబంధించిన సెట్ ల‌ని భారీ స్థాయిలో ఏర్పాటు చేసి ఈ మూవీని నిర్మించారు. 2005 లో వ‌చ్చిన ఈ మూవీ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోగా డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ఇక ఇదే పంథాలో 2008లో వ‌చ్చిన చిత్రం `ఒక్క మాగాడు`. వైవీఎస్ చౌద‌రి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈమూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి తెర‌కెక్కించాడు. ఈ మూవీ మీద విచ్చినన్ని విమ‌ర్శ‌లు మ‌రో సినిమా మీద రాలేదేమో అంత‌గా మీమ్స్‌, కామెంట్ లు వినిపించాయి. క‌మ‌ల్ హాస‌న్ తో శంక‌ర్ తెర‌కెక్కించిన `భార‌తీయుడు` చిత్రాన్ని కాపీ చేసి ఈ మూవీని చేశార‌ని చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు కూడా. ఇండిపెండెన్స్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం బాల‌య్య కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది.

తెలంగాణ సాయుధ పోరాటం నేప‌థ్యంలో రూపొందిన చిత్రం `రాజ‌న్న‌`. నిజాం ప్రాంత విముక్తి కోసం జ‌రిగిన పోరాటం నేప‌థ్యంలో ఈ మూవీని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెర‌కెక్కించారు. రాజ‌మౌళి పోరాట ఘ‌ట్టాల‌ని డిజైన్ చేశారు. మ‌ల్ల‌మ్మ అనే ఓ పాట నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో నాగార్జున కూడా న‌టించారు. టైటిల్ పాత్ర‌లో న‌టించారు. క‌థ మొత్తం మ‌ల్ల‌మ‌మ్మ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. నాగార్జున పాత్ర అతిథి పాత్ర అని చెప్పొచ్చు.

రాజ‌మౌళి ఫాద‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌పైకొచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఇక ఇదే పంథాలో తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని చేశారు. స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గురువుగా అతిథి పాత్ర‌లో న‌టించారు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా `సైరా న‌ర‌సింహారెడ్డి` పౌరుషాన్ని ప‌రిచ‌యం చేసే పాత్ర‌లో అనుష్క క‌నిపించింది.

తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్‌, మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ ఈ చిత్ర క‌థ‌ని ప‌రిచ‌యం చేస్తూ వాయిస్ ఓవ‌ర్ అందించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. బాలీవుడ్ లో ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీ నేప‌థ్యంలో రూపొందిన రెండు చిత్రాలు కూడా భారీ డిజాస్ట‌ర్ లు గా నిలిచాయి. కంగ‌న ర‌నౌత్ న‌టించిన `మ‌ణిక‌ర్ణిక‌`, అమీర్ ఖాన్ న‌టించిన `మంగ‌ల్ పాండే` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వైఫ‌ల్యాల్ని చ‌విచూశాయి. దీంతో ఇండిపెండెన్స్ నేప‌థ్యంలో సినిమాలు చేయాలంటేనే మ‌న వాళ్లు భ‌య‌ప‌డుతున్నారు.