Begin typing your search above and press return to search.

సీన్ రివ‌ర్స్ : ఐపీఎల్ కు ట్రిపుల్ ఆర్ భారీ షాక్

By:  Tupaki Desk   |   10 April 2022 2:30 AM GMT
సీన్ రివ‌ర్స్ : ఐపీఎల్ కు ట్రిపుల్ ఆర్ భారీ షాక్
X
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఎప్పుడు మొద‌లైందో కానీ దాని వ‌ల్ల సినిమాల‌కు భారీ షాక్ త‌గ‌ల‌డం మొద‌లైంది. ఈ సీజ‌న్ మొద‌లైందంటే చాలా త‌మ సినిమాల రిలీజ్ ల‌ని వాయిదా వేసుకోవాలా? అని ఆలోచించ‌ని హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ లేరు. అంత‌లా సినిమాల‌పై ఐపీఎల్ తీవ్ర ప్ర‌భావ‌న్ని చూపించి కొంత మంది హీరోల చిత్రాల‌కు ఓ ద‌శ‌లో క‌లెక్ష‌న్ ల ప‌రంగా తీవ్ర ఇబ్బందులు క‌లిగించింది. దీంతో ఐపీఎల్ సీజ‌న్ వ‌స్తోందంటే చాలా మ‌న వాళ్లు సినిమా రిలీజ్ ల‌ని వాయిదా వేసుకున్న సంద‌ర్భాలు కూడా వున్నాయి.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ అంటే అంత క్రేజ్ ఇక స‌మ్మ‌ర్ లో మొద‌ల‌య్యే ఈ సీజ‌న్ కి యంగ్ స్ట‌ర్స్ ఫిదా అయిపోతూ టీవీల‌కు అతుక్కుపోతుంటారు. హాట్ ఫేవ‌రేట్ జట్ల‌ని ఫాలో అవుతూ క్ర‌మం త‌ప్ప‌కుండా మ్యాచ్ ల‌ని వీక్షిస్తూ వుంటారు. దీంతో యంగ్ స్ట‌ర్స్ ఎంత పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయినా థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి క‌నిపించ‌దు. అయితే ఆ లెక్క‌లన్నీ ఇప్ప‌డు మారిపోయాయి. ఐపీఎల్ సీజ‌న్ అంటే సినిమా భ‌య‌ప‌డే స్థాయి నుంచి సినిమా అంటే ఐపీఎల్ భ‌య‌ప‌డే స్థాయికి చేరింది.

ఈ భారీ మార్పుకు శ్రీ‌కారం చుట్టింది జ‌క్క‌న్న సినిమా `ట్రిపుల్ ఆర్‌`. మార్చి 26న అట్ట‌మాసంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచ్ లు మొత్తం 10 జ‌ట్ల‌తో మొద‌ల‌య్యాయి. దీంతో మార్చి 25న విడుద‌లైన ట్రిపుల్ ఆర్ క‌లెక్ష‌న్ ల‌పై దీని ప్ర‌భావం తీవ్రంగా వుండే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ వ‌ర్గాలు కూడా ఆందోళ‌న‌ని వ్య‌క్తం చేశాయి. కానీ ఐపీఎల్ ప్ర‌భావం ట్రిపుల్ ఆర్ పై ఏ మాత్రం చూపించ‌లేదు.

అంతే కాకుండా మ్యాచ్ లు ఇంత‌కు ముందు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌రిగేవి కానీ తాజా ఐపీఎల్ మాత్రం మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతోంది. దీంతో ఎవ‌రు కూడా ఈ మ్యాచ్ ల‌పై ఆస‌క్తిని చూపించ‌డం లేదు. గ‌త ఏడాది తో పోలిస్తే ఈ సీజ‌న్ పేల‌వంగా స్టార్ట్ కావ‌డంతో ఆ కాస్ట్ ఆస‌క్తి కూడా ప్రేక్ష‌కుల్లో క్రికెట్ అభిమానుల్లో క‌నిపించ‌డం లేదు. మ్యాచ్ మ్యాచ్ కి ప్రేక్ష‌కుల సంక్ష గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుండ‌టంతో నిర్వాహ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కోట్లు కుమ్మ‌రించి ఎంచుకున్న జ‌ట్లు మ్యాచుల్లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ని ఇస్తుండ‌టంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ల‌పై ఆస‌క్తిని చూపించ‌డం లేదట‌.

అంతే కాకుండా రీసెంట్ గా విడుద‌లైన `ట్రిపుల్ ఆర్` పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది. ఆ కార‌ణంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారే కానీ ఐపీఎల్ మ్యాచ్ ల‌ని చూసేందుకు క్రికెట్ స్టేడియాల‌కు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ట‌. ఈ మ్యాచ్ ల‌ని ప్ర‌సారం చేస్తున్న ఛాన‌ల్ ల రేటింగ్ కూడా త‌గ్గిపోవ‌డంతో నిర్వాహ‌కులు షాక్ కు గుర‌వుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ్యాచ్ లు సాయంత్రం ప్రారంభం అవుతున్న విష‌యం తెలిసిందే.

అయితే అదే స‌మ‌యంలో ఇంటిల్లిపాదీ ట్రిపుల్ ఆర్ కోసం థియేట‌ర్ల‌కు వెళుతున్నార‌ట‌. ఆ కార‌ణంగానే ఐపీఎల్ మ్యాచ్ ల టీఆర్పీ రేటింగ్ దారుణంగా ప‌డిపోయిన‌ట్టుగా చెబుతున్నారు. 65 రోజుల పాటు 74 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇదే త‌ర‌హాలో స్పంద‌న వుంటే ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ సీజ‌న్ భారీ న‌ష్టాల‌ని చ‌విచూడ‌టం గ్యారెంటీ అంటున్నారు.