Begin typing your search above and press return to search.
ఇద్దరి విశ్వరూపాన్ని ఒకే తెరపై చూపించేదే 'కేజీఎఫ్ 2'
By: Tupaki Desk | 11 April 2022 3:28 AM GMT'రాధే శ్యామ్' .. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఆ స్థాయి ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కేజీఎఫ్ 2' రెడీ అవుతోంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దాంతో దర్శ కుడు ప్రశాంత్ నీల్ .. హీరో యశ్ ఇద్దరూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ వరుస ప్రెస్ మీట్ ల తో .. ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ ను .. యశ్ ను పర్హాన్ అక్తర్ చేసిన ఇంటర్వ్యూ విశేషాలు ఆసక్తికరంగా మారాయి.
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ .. 'కేజీఎఫ్' కథను రెడీ చేసుకున్నప్పుడు ముందుగా నా కళ్లలో మెదిలిన హీరో యశ్ నే. ఆయన అయితేనే ఈ పాత్రకి పూర్తి న్యాయం జరుగుతుందని అనిపించింది. కన్నడలో యశ్ కి మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.
ఆ సినిమాలో పాత్ర .. కథాకథనాలు అందుకు దగ్గరగా ఉంటాయి. అందువలన వాళ్లకి కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆ కథకి .. పాత్రకి ఆయన అయితేనే కరెక్ట్ అనుకున్నారు. అందువల్లనే ఆ సినిమా ఆ స్థాయి సక్సెస్ ను సాధించింది.
నిజానికి ఈ కథ అనుకున్నప్పుడు .. తెరకెక్కించినప్పుడు కన్నడలో మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నాము. కానీ ఈ రేంజ్ లో అన్ని భాషల్లోను రెస్పాన్స్ వస్తుందని ఎంత మాత్రం మేము అనుకోలేదు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా మారుతుందనీ .. ఇంతవరకూ వస్తామని ఎంతమాత్రం ఊహించలేదు. ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాతనే సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే కథపై మళ్లీ కసరత్తు చేయడం మొదలైంది. 'కేజీఎఫ్' అభిమానుల అంచనాలను దాటేసి వెళ్లిపోయింది.
అయితే ఇప్పుడు వాళ్లంతా కూడా 'కేజీఎఫ్ 2' అంతకుమించి ఉండాలని కోరుకుంటారు. అందువలన యశ్ పాత్రను మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేయించడం జరిగింది. 'కేజీఎఫ్'కి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందువలన ఈ సారి వాళ్లను మరింత సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఓ పవర్ఫుల్ రోల్ కోసం సంజయ్ దత్ ను తీసుకోవడం జరిగింది. ఈ రెండు పాత్రల విశ్వరూపాలను ప్రేక్షకులు తెరపై చూస్తారు.
సంజయ్ దత్ ఎంట్రీతో ఈ సినిమా భారీతనం మరింత పెరిగిపోయింది. మిగతా పాత్రలకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం వలన, ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాము. కొత్త రికారులకు తెరతీయడం ఖాయమని భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు