Begin typing your search above and press return to search.
హైప్ లేదు.. హంగామా లేదు..బజ్ లేదు.. కేజీఎఫ్ 2 వస్తోంది తెలుసా?
By: Tupaki Desk | 12 April 2022 6:36 AM GMTట్రిపుల్ ఆర్ కోసం యావత్ దేశం మొత్తం దాదాపు మూడున్నరేళ్ల పాటు ఎదురుచూసింది. ఇద్దరు సూపర్ స్టార్ లు నటించిన సినిమాని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడాలా? .. ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ క్షణం రానే వచ్చింది. మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో `ట్రిపుల్ ఆర్` థియేటర్లలో సందడి చేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ కు ముందు రోజు నుంచే హంగమా చేయడం మొదలుపెట్టిన ట్రిపుల్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ రికార్డుల్ని మడతపెట్టడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ పలు కీలక రికార్డుల్ని సమం చేసి చరిత్ర సృష్టించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టార్ తరువాత అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2`. యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. `కేజీఎఫ్ చాప్టర్ 1` కు ఫ్రాంచైజీగా వస్తున్న చిత్రమిది. `కేజీఎఫ్ చాప్టర్ 1` సైలెంట్ గా వచ్చి రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో `కేజీఎఫ్ చాప్టర్ 2` బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించే అవకాశం వుందని, అంతే కాకుండా3 ఈ మూవీ బాహుబలి, పుష్ప , ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ని కూడా తిరగరాస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఫస్ట్ పార్ట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హాలీవుడ్ యాక్షన్ చిత్రాలని గుర్తు చేయడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. దీంతో ఈ మూవీ కన్నడ, తెలుగు భాషలతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సంచలనాలు సృష్టించింది. ఊహించని స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస వద్ద భారీ వసూళ్లని రాబట్టిన తొలి కన్నడ పాన్ ఇండియా మూవీగా రికార్డుని సొంతం చేసుకుంది.
కానీ ట్రైలర్ రిలీజ్ కి ముందు నుంచే అభిమానులు వీక్ ప్రమోషన్స్ అంటూ చిత్ర బృందంపై విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా మూవీకి సరైన ప్రమోషన్ చేయడం లేదని, ఇలాగైతే కష్టమని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై విమర్శలు చేశారు. ఆ తరువాత ఫైనల్ గా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ నే ప్రధానంగా చూపించడం... పైగా రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ వీక్ గా వుండటంతో ముందున్న బజ్ ఈ మూవీపై ఏ మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ ఈ మూవీ ప్రమోషన్స్ చాలా వీక్ గా వున్నాయని, చాప్టర్ 1 తో పోలిస్తే చాప్టర్ 2కు పెద్దగా బజ్ కనిపించడం లేదని సినీ లవర్స్ వాపోతున్నారు. పార్ట్ 1 కారణంగా ఏర్పడిన హైప్ ని క్యారీ చేయడం లో కానీ దాన్నీ అడ్వాంటేజ్ గా తీసుకోవడంలో కారీ మేకర్స్ పూర్తిగా విఫలమయ్యారని ఇప్పటికే అబిమానులు బోరుమంటుంటే సినీ లవర్స్ , క్రిటిక్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. హైప్ లేదు.. హంగామా లేదు..బజ్ లేదు.. కేజీఎఫ్ 2 పై అంటూ సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో `కేజీఎఫ్ చాప్టర్ 2` విడుదల కాబోతోంది. అయినా ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడుతోనూ.. మరీ ముఖ్యంగా నార్త్ మార్కెట్ లోనూ ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఎలాంటి హైప్ కానీ క్రేజ్ కానీ.. వావ్ అనిపించే రేంజ్ లో బజ్ కానీ కనిపించడం లేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి. దీనికి మేకర్స్ కరెక్ట్ గా స్పందించకపోవడమేనని, పాన్ ఇండియా మూవీగా వస్తున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` కు ఈ రేంజ్ పబ్లిసిటీ, ప్రమోషన్స్ ని చేయకపోవడమేనని, ఇది దేశ వ్యాప్తంగానే కాకుండా యుఎస్ మార్కెట్ లోనూ ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.