Begin typing your search above and press return to search.
'గని' సినిమాకి రిఫరెన్స్ పవర్ స్టార్ 'తమ్ముడు'నే!
By: Tupaki Desk | 7 April 2022 4:42 AM GMTవరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి 'గని' సినిమా రూపొందించాడు. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన 'రిలీజ్ పంచ్' ఫంక్షన్లో దర్శకుడు కిరణ్ కొర్రపాటి .. ' జై పవర్ స్టార్' అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. "ఈ సినిమాకి ఒక రకంగా పవర్ స్టార్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒకప్పుడు ఆయన 'తమ్ముడు' అనే మూవీ తీశారు. ఎప్పుడైతే వరుణ్ తేజ్ ఒక బాక్సింగ్ మూవీ చేద్దామని అన్నారో, అప్పుడు నాకు దొరికిన రిఫరెన్స్ 'తమ్ముడు'.
అందువలన 'జై పవర్ స్టార్' అనడంలో హండ్రెడ్ పెర్సెంట్ న్యాయం ఉంది. ఇక 'గని' విషయానికి వస్తే జీవితంలో గెలవాలనుకునే ప్రతి ఒక్కరి కథ ఇది. వరుణ్ తేజ్ గారు నన్ను .. ఈ కథను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇచ్చారు.
ఈ సినిమాను కరోనా సమయంలో ఒక యుద్ధంలా చేశాము. మా నాయకుడిగా వరుణ్ తేజ్ ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఈ యుద్ధానికి బలం అరవింద్ గారితో పాటు నిర్మాతలిద్దరూ. ఏ రోజూ కూడా టెన్షన్ పడకుండా ఎప్పటికప్పుడు కావలసినవి ఏర్పాటు చేశారు. అలాగే నా బలగం నా టీమ్ .. నాకు ఎంతో సహకరించింది.
తమన్ గారు ఈ సినిమాకి ఇరగదీసే పాటలు ఇచ్చారు .. అంతకు మించిన రీ రికార్డింగ్ ఇచ్చారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ గారు అద్భుతంగా చేశారు. ఆయన చుట్టూ ఐదు పాత్రలు తిరుగుతూ ఉంటాయి.
ఈ సినిమాకి ఒక పిల్లర్ ఉపేంద్రగారు అయితే .. మరో పిల్లర్ సునీల్ శెట్టి గారు. ఇక జగపతిబాబుగారు .. నదియాగారు .. నవీన్ చంద్రగారు .. ఈ పాత్రలన్నీ వరుణ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కోపంగా గానీ .. బాధగా గానీ .. ప్రేమగా గాని. లవ్లీ గర్ల్ సయీ మంజ్రేకర్ పాత్ర వరుణ్ చుట్టూ ప్రేమతో తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన విడుదలవుతోంది. మీరంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను" అంటూ ముగించారు.