Begin typing your search above and press return to search.

ఏడేళ్ల తర్వాత సూపర్ స్టార్‌ కోసం ముద్దుగుమ్మ రీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 AM GMT
ఏడేళ్ల తర్వాత సూపర్ స్టార్‌ కోసం ముద్దుగుమ్మ రీ ఎంట్రీ
X
మహేష్ బాబు సినిమా '1 నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించిన కృతి సనన్ తెలుగు లో పెద్దగా సినిమాలు చేయకుండానే బాలీవుడ్‌ కు వెళ్లి పోయింది. 2015 తర్వాత సౌత్‌ లో ఈ అమ్మడు కనిపించలేదు. బాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. అక్కడ మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల్లో మరియు పెద్ద బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ లో దూసుకు పోతుంది.

సౌత్‌ సినిమా ఇండస్ట్రీ లో అతి త్వరలోనే ఈమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. తమిళ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న సినిమా లో హీరోయిన్ గా కియారా అద్వానీ ని ఎంపిక చేయబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని ఇప్పటికే దిల్‌ రాజు బ్యానర్‌ లో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే.. అంతే కాకుండా బాలీవుడ్‌ లో కూడా ఆమె బిజీగా ఉంది.

కియారా అద్వానీకి డేట్లు అడ్జస్ట్‌ కాకపోవడం తో ఆ స్థానంలో నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్ ను తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏడు సంవత్సరాల తర్వాత సౌత్‌ లో ఈమె నటించబోతుంది. ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమా లో ఈ అమ్మడు నటిస్తుంది. కాని ఆ సినిమా సౌత్‌ సినిమా కాదు. పూర్తిగా హిందీ లో రూపొందుతున్న సినిమా అది. కనుక టెక్నికల్‌ గా విజయ్ సినిమా నే కృతికి రీ ఎంట్రీ మూవీ అవుతుంది.

విజయ్‌ హీరోగా నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్‌ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఆ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన బీస్ట్‌ సినిమా విడుదల హడావుడి పూర్తి అయిన వెంటనే వంశీ పైడిపల్లికి డేట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. మే లేదా జూన్ లో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

విజయ్ ఏ సినిమాను చూసినా కూడా అయిదు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోడు. కనుక ఈ సినిమా కు కూడా ఖచ్చితంగా అంతకు మించి సమయం తీసుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయ్‌ కి జోడీగా కృతి సనన్‌ నటిస్తే సౌత్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా సినిమా పై ఆసక్తి కనబర్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.