Begin typing your search above and press return to search.
మణిశర్మ మాస్ ఫీస్ట్.. 'లాయర్ పాప' పాట..!
By: Tupaki Desk | 2 April 2022 8:11 AMయంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ''నేను మీకు బాగా కావాల్సినవాడిని''. ఇందులో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన కిరణ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
ఈ క్రమంలో ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా సినిమా నుంచి 'లాయర్ పాప' అనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు. 'రా.. రా లాయర్ పాప రా.. లవ్ జైల్లో ఉన్నాగా.. బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా' అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ ని అలరిస్తోంది.
లాయర్ అయిన హీరోయిన్ ప్రేమలో పడిన హీరో.. తిరిగి ఆమెను ప్రేమించమని వెంటపడుతూ ఈ పాట పాడుకుంటున్నాడు. ఇందులో సంజనా ఆనంద్ అందంగా కనిపించగా.. కిరణ్ అబ్బవరం మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు.
'లాయర్ పాప' సాంగ్ కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాస్ ట్యూన్ కంపోజ్ చేయగా.. సింగర్ రామ్ మిరియాల హుషారుగా ఆలపించారు. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాసారు.
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాతో కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. దివంగత సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారుతున్నారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది.
రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.