Begin typing your search above and press return to search.
మహావీర్యార్ : మాలీవుడ్ బాహుబలి అనాలా?
By: Tupaki Desk | 4 April 2022 2:39 AM GMTహాలీవుడ్ బాలీవుడ్ ని డామినేట్ చేసే సినిమాలు దక్షిణ భారతదేశంలో తెరకెక్కుతున్నాయా? అంటే అవుననేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో మలయాళీ స్టార్ హీరో నివిన్ పౌలీ చిత్రం మహావీర్యార్ క్వాలిటీ మేకింగ్ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా విజువల్ ఫీస్ట్ అనిపించే టీజర్ విడుదలైంది. ఇది అన్ని రకాల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకటిన్నర నిమిషాల క్లిప్ ఫాంటసీ హిస్టారికల్ .. లీగల్ .. టైమ్ ట్రావెల్ జానర్ ల అద్భుతమైన సమ్మేళనంతో తెరకెక్కిందని హింట్ ఇచ్చింది.
అబ్రిడ్ షైన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా టీజర్ లో ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా కనిపించే విభిన్న షాట్ ల సమాహారంగా కనిపిస్తోంది. ఒక రాజభవనం లేదా కోట ప్రాంగణం.. సంధ్యా సమయంలో గుర్రపు స్వారీ.. జైపూర్ లోని అమెర్ కోట షాట్ వంటి విభిన్న సన్నివేశాల్ని టీజర్ లో అమర్చారు. వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా ఈ విజువల్స్ లో ఇచ్చిన ఎలివేషన్ ఆశ్చర్యపరుస్తోంది. ఆధునిక యుగంలో కోర్టు కార్యకలాపాలను కలిగి ఉన్న క్లుప్త దృశ్యంతో ఇంటర్ కట్ చేసిన తీరు ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలు .. యూనిఫాం ధరించిన పోలీసుల ద్వారా అంచనా వేయగలిగేలా ఉంది.
విజువల్ స్టైల్ ఎలివేషన్ నిజంగా అద్భుతంగా కుదిరింది. సంధ్యా సమయం.. తెల్లవారుజాము స్పష్టమైన దృశ్యాలు.. వెన్నెల సిల్హౌట్ లు.. కాంతిని తెలివిగా ఉపయోగించడం ..ఒక చిన్న అగ్నికీల పక్కన ఒక మారుమూల ప్రదేశంలో ధూమపానం చేస్తున్న గాడ్ మాన్. ప్రతిదీ సినిమాటిక్ వేలో ఎంతో ఎలివేషన్ తో కనిపిస్తుంది. టీజర్ నుండి ప్లాట్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకోవడం చాలా కష్టం. టీజర్ తన పని తాను చేసుకుపోతుంది. ఇది ఏమీ బహిర్గతం చేయకుండా రహస్య భావనను సృష్టించింది. ఇంకా చూడాలి తెలుసుకోవాలి అని మరింతగా కోరుకునేలా చేస్తుంది.
కాస్ట్ లీగా విజువల్స్ .. నిర్మాణ విలువను బట్టి చూస్తే.. ఈ సినిమా వెనుక అత్యంత భారీ బడ్జెట్ ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ- లాల్- లాలూ అలెక్స్- సిద్దిక్ - శాన్వి వంటి ముఖాలు హాలీవుడ్ అప్పీల్ ని తెచ్చాయి. భారీ కాస్ట్యూమ్స్ విజువల్స్ హాలీవుడ్ లుక్ ని తీసుకొచ్చాయి. దశాబ్ద కాలం తర్వాత నివిన్ పౌలీ- ఆసిఫ్ అలీ కాంబినేషన్ లో ఓ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎం ముకుందన్ రాసిన కథ ఆధారంగా మహావీర్యార్ తెరకెక్కింది. ఈ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.