Begin typing your search above and press return to search.

RRR కోసం తారక్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు..!

By:  Tupaki Desk   |   1 April 2022 3:43 PM GMT
RRR కోసం తారక్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాతో ట్రాక్ మార్చి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'నాన్నకు ప్రేమతో' 'జనతా గ్యారేజ్' 'జై లవకుశ' 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలతో జోష్ మీదున్న తారక్.. ఇప్పుడు ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన RRR చిత్రంలో తారక్ తొలిసారిగా మరో హీరో రామ్ చరణ్‌ తో స్ర్కీన్ షేర్ చేసున్నారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

సక్సెస్ ఫుల్ గా మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న 'ఆర్.ఆర్.ఆర్'.. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద తన దాడిని కంటిన్యూ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్ ఇవ్వగా.. యూఎస్ఏ మరియు నార్త్ ఇండియాలో సాలిడ్ కలెక్షన్స్ తో స్ట్రాంగ్ గా నిలబడింది.

ట్రిపుల్ ఆర్ చిత్రంలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు. అమాయకుడిగా తన జాతి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిగా.. అవసరమైనప్పుడు తన బలాన్ని చూపించే వీరుడిగా.. నీటికి ప్రతీకగా తారక్ అదరగొట్టాడు.

ఎలాంటి క్లిష్టమైన పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగిన ఎన్టీఆర్.. ఇప్పుడు భీమ్ పాత్ర ద్వారా మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం సౌత్ కు మాత్రమే తెలిసిన తన యాక్టింగ్ టాలెంట్ ను RRR సినిమాతో దేశవ్యాప్తంగా చాటిచెప్పారు.

'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఇంట్రడక్షన్ సీన్ లో సింహంతో పోరాడి బంధించే సీన్ కు థియేటర్లలో ఫ్యాన్స్ ఈలలతో గోలగోల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

అయితే భీమ్ పాత్ర అంత బాగా రావడం వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంది. అద్భుతమైన నైపుణ్యం మరియు అంకితభావంతో నెలల తరబడి డైట్ మెయింటైన్ చేసి బరువు తగ్గాడు ఎన్టీఆర్. జిమ్‌ లో రోజుకు రెండు గంటలపాటు కఠిన వ్యాయామాలు చేసి కండలు పెంచాడు.

ఇంటర్వెల్‌ కు ముందు స్పెషల్ సీన్ చేయడానికి డిసెంబర్‌ లో 5-6 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు 65 రాత్రులు షూట్ లో పాల్గొన్నారు తారక్. ఇక సింహంతో ఫైట్ సీన్ కోసం బల్గేరియా అడవుల్లో కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తాడు. వీఎఫ్‌ఎక్స్ సాయంతో ఈ సీన్‌ ను పూర్తి చేసినప్పటికీ.. అది రియల్‌ గా కనిపించేందుకు చాలా కష్టపడ్డారు.

RRR లో ఎన్టీఆర్ తన పాత్ర కోసం ఫిజికల్ గా మెంటల్ గా అంత కృషి చేసారు కాబట్టే.. ఇప్పుడు స్క్రీన్ మీద అంత అద్భుతంగా వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ తన రోల్ కు వస్తోన్న ప్రశంసలపై స్పందించారు. "నాకు ఇది స్పెషల్ ఫిల్మ్. ఇకపై నా కెరీర్ గురించి మాట్లాడాలంటే అందరూ 'ఆర్.ఆర్.ఆర్' కు ముందు.. ఆ తర్వాత అని చెప్పుకొంటారు. నటుడిగా ఇప్పటివరకూ చేసిన దానికంటే ఈ సినిమా నా నుంచి ఎంతో శ్రమ కోరుకుంది. నాకొక కొత్త ఆరంభాన్ని అందించింది. ఇందులో పని చేసినందుకు గర్వపడుతున్నాను'' అని అన్నారు.

''ఈ సినిమాలో నా ఇంట్రో సీన్ ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని అందరూ చెబుతున్నారు. సాధారణంగా హీరో ఇంట్రో సీన్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు.. ఈలలు వేస్తారు. కొంత సమయానికి సినిమాలో లీనమైపోతారు. కానీ, ఈ సినిమాలో నా ఇంట్రడక్షన్ చూస్తే భీమ్ గురించి ఒక పూర్తి అవగాహన వస్తుంది. దర్శకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక గొప్ప సన్నివేశం. ఇందులోని చాలా సీన్స్ ని ప్రేక్షకులు ఫోన్లలలో రికార్డ్ చేసి యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. వాటిని చూసి నేనూ ఆనందించాను'' అని తారక్ చెప్పుకొచ్చారు.