Begin typing your search above and press return to search.
మెగా వారి హీరో ఎందుకిలా చేస్తున్నాడు?
By: Tupaki Desk | 13 April 2022 6:30 AM GMTఅంతా ఓ బాటలో నడిస్తే నేను మాత్రం సెపరేట్ ట్రాక్ లోకి వెళతాను అన్నట్టుగా వుంది యంగ్ హీరో, మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ పరిస్థితి. అంతా కమర్షియల్ బాటపడుతూ భారీ చిత్రాల వైపు అడుగులు వేస్తుంటే తొలి చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన పంజా వైష్ణవ్ తేజ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల వెంటపడుతుండటం ఎవరికీ అంతు చిక్కడం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించి తొలి సారి దర్శకత్వం వహించిన చిత్రం `జానీ`. ఈ చిత్రంతో బాలనటుడిగా 2003 లోనే ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ యంగ్ పవన్ కల్యాణ్ గా కనిపించి అదరగొట్టాడు.
ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్ దాదా ఎంబీ బీఎస్`లో బారు జుట్టుతో వీల్ చైర్ లో కనిపించే శ్రీరామచంద్రమూర్తి అనే పాత్రలో కనిపించి మరింతగా ఆకట్టుకున్నాడు. ఇక గత ఏడాది కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలకు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వున్న సమయంలో `ఉప్పెన` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు. మెగా ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన ఈ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంతోనే 100 కోట్ల క్లబ్ లో చేరి అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్ల కారణంగా వైష్ణవ్ తేజ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. అయితే ఈమూవీ తరువాత అంతకు మించి అనే స్థాయిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ `కొండ పొలం`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
దీంతో వైష్ణవ్ తేజ్ `ఉప్పెన`తో లభించిన క్రేజ్ ని నిలుపుకోలేకపోయాడే కామెంట్ లు వినిపించడం మొదలైంది. మాస్ హీరో గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో ఇలా కెరీర్ ప్రారంభం లోనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం `రంగ రంగ వైభవంగ`. కొత్ దర్శకుడు గిరీషాయ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా వుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు కాకుండా మాస్ ఎలిమెంట్స్ వున్న కమర్షియల్ చిత్రాల వైపు పంజా వైష్ణవ్ తేజ్ అడుగులు వేయాలని మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.