Begin typing your search above and press return to search.
హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ చేస్తున్న వీరమల్లు..!
By: Tupaki Desk | 7 April 2022 6:47 AM GMTపవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ''హరి హర వీరమల్లు''. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెండేళ్ళ క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. కోవిడ్-19 పాండమిక్ మరియు పవన్ ఇతర ప్రాధాన్యతల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.
ఇప్పటి వరకు 'హరి హర వీరమల్లు' సినిమాకు సంబంధించిన షూటింగ్ 50 శాతం మాత్రమే పూర్తయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. రెండు నెలల విరామం తర్వాత పవన్ సెట్స్ పైకి వచ్చాడు.
“హరి హర వీర మల్లు” సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ కళ్యాణ్ బుధవారం నాడు రిహార్సల్ స్టార్ట్ చేశారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టోడోర్ లాజరోవ్ ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పవన్ కళ్యాణ్ రిహార్సల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు.
చాలా కాలం తర్వాత తమ ఫేవరేట్ హీరోని ఈ విధంగా చూడటంతో పీకే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' సినిమాలో చాలా వరకు ఫైట్ సీన్స్ డూప్ ని పెట్టి చేయించారని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'వీరమల్లు' షూటింగ్ రేపటి (ఏప్రిల్ 8) నుండి పునఃప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. జూలై నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారట. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోందని టాక్. ఇప్పటికే హైదరాబాద్ లో మొగల్ కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్‌లు వేశారు.
ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. అలానే ఆయనకు ఫస్ట్ పీరియాడికల్ మూవీ.
ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
'హరిహర వీరమల్లు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇకపోతే పవన్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారని టాక్ వినిపిస్తోంది.