Begin typing your search above and press return to search.

పవన్ 'రీమేక్' ఆలోచన విరమించుకున్నాడా..?

By:  Tupaki Desk   |   10 April 2022 3:30 AM GMT
పవన్ రీమేక్ ఆలోచన విరమించుకున్నాడా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కాకపోతే రీమేక్ తో రీఎంట్రీ ఇవ్వడం.. వరుసగా రీమేక్ చిత్రాలనే లైన్ లో పెడుతుందటం కొందరికి నచ్చలేదు. 'పింక్' రీమేక్ గా 'వకీల్ సాబ్' సినిమా తెరకెక్కితే.. 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ గా 'భీమ్లా నాయక్' మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

తమిళ దర్శక నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'వినోద‌య సీత‌మ్‌' చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తారని ఇటీవల రోజుగా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథలో మార్పులు చేర్పులు చేసే బాధ్యత తీసుకున్నారని.. ఇందులో పవన్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తారని చెప్పుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ కోసం ఇరవై రోజుల కాల్షీట్స్ కేటాయించారని.. ఇందుకుగాను 50 కోట్లు తీసుకోనున్నారని..ముందు ఈ చిత్రాన్నే పూర్తి చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా బ్యానర్ మీద ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఊసే లేదు. దీని గురించి ఎక్కడా చ‌ర్చ కూడా జరగడం లేదు.

దీనికి తోడు పవన్ ఇతర షూటింగ్ లలో బిజీ అవడానికి ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'వినోద‌య సీత‌మ్‌' రీమేక్ చేసే ఆలోచన విరమించుకున్నారేమో అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ రీమేక్ వార్తలు వచ్చినప్పుడు పీకే ఫ్యాన్స్ కలవరపడ్డారు. తమ హీరోని రీమేక్ స్టార్ అని ట్రోల్ చేస్తారని భావించారు.

పవన్ కెరీర్ లో సగం సినిమాలు రీమేక్ చిత్రాలే అనే సంగతి తెలిసిందే. అందుకే ఇకపై అలాంటి చిత్రాలు చేయకూడదని ఈ రీమేక్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే జీ5 ఓటీటీలో 'వినోదియ సీతం' తెలుగు వెర్షన్ ను తొలగించడంతో మరో రీమేక్ మూవీ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని స్టార్ట్ చేయకుండా.. పవన్ ఇతర కమిట్మెంట్స్ ను ముందుకు తీసుకురావడంతో మనసులో సంతోషిస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో హరీష్ శంకర్ తో కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనునున్నారు. ఇప్పటికే మేకర్స్ దీనిపై హింట్ ఇచ్చారు. ఇవి పూర్తవడానికి సమయం పడుతుంది. మరోవైపు రాజకీయాల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని పవన్ ప్రస్తుతానికి తమిళ్ రీమేక్ ని పక్కన పెట్టారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ రీమేక్ ఎప్పటికీ చేయకుండా ఉంటేనే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.