Begin typing your search above and press return to search.
రూ. 500 లకు మర్డర్ లు చేసే `కొటేషన్ గ్యాంగ్`
By: Tupaki Desk | 31 March 2022 6:31 AM GMT`ఫ్యామిలీ మ్యాన్` వెబ్ థ్రిల్లర్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకున్నారు నటి ప్రియమణి. సినిమాల్లో నటిస్తూనే విభిన్నమైన వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారామె. ఇటీవల `ఆహా` ఓటీటీ కోసం `భామా కలాపం` వెబ్ సిరీస్ లో నటించిన ప్రియమణి తాజాగా మరో థ్రిల్లర్ మూవీతో రాబోతున్నారు. అయితే ఈ సారి ఆమె క్రేజీ లేడీ సన్నీలియోన్ తో కలిసి ఓటీటీలో సందడి చేయబోతున్నారు. ప్రియమణి నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ `కొటేషన్ గ్యాంగ్`. వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. కేరళలో జరిగిన ఓ రియల్ గ్యాంగ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు.
ఫిల్మీ నటి ఎంటర్ టైన్ మెంట్స్, విస్టెల్ మ్యాన్ ఫిల్స్ ఈ మూవీని గాయత్రి సురేష్, వివేక్ కె, వివేకనందన్ జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రియమణితో పాటు సన్నీ లియోన్, జాకీష్రాఫ్, సారా ప్రాధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం వీరి పాత్రలని పరిచయం చేస్తూ వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లని చిత్ర బృందం విడుదల చేసింది. ఒళ్లంతా గాయాలతో.. ముఖం చిట్లిపోయి బ్లాడ్ ఆకరుతూ చిత్ర విచిత్రంగా ప్రియమణి, సన్నీ లియోన్, జాకీష్రాఫ్, సారా ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ప్రియమణి కాంట్రిక్ట్ కిల్లర్ గా కనిపించబోతోంది. జాకీష్రాఫ్ విలన్ గా కనిపించబోతున్నారు. నాటలు తుపాకీతో రూ. 500 లకు మర్డర్ లు చేసే బ్యాచ్ గా ప్రియమణి, సన్నీ లియోన్, సారా లు కనిపిస్తారట. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ మూవీని ఇటీవల ప్రారంభించిన దర్శకుడు రాకెట్ స్పీడుతో పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. జాకీష్రాఫ్ పాత్ర కోసం ముందు గోవిందాని అనుకున్నారట. కానీ కుదరకపోవడంతో ఫైనల్ గా జాకీష్రాఫ్ ని తీసుకున్నారట.
ఈ మూవీలో ప్రియమణి శకుంతలగా, సన్నీ లియోన్ పద్మగా, జాకీ ష్రాఫ్ .. ముస్తాఫాగా, సారా ఐరాగా కనిపించబోతున్నారు. ఓ లేడీ గ్యాంగ్ స్టర్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ఐదు బాషల్లో రిలీజ్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో లో ప్రధానంగా ఈమూవీని నిర్మించారు. మిగతా భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత ప్రియమణి తమిళంలో నటించిన చిత్రమిది కావడం విశేషం.