Begin typing your search above and press return to search.

రామ్ సరికొత్త ప్ర‌యోగం.. త‌న‌కు తానే విల‌న్ అట‌..?

By:  Tupaki Desk   |   29 March 2022 1:30 PM GMT
రామ్ సరికొత్త ప్ర‌యోగం.. త‌న‌కు తానే విల‌న్ అట‌..?
X
టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం లింగుస్వామి దర్శకత్వంలో `ది వారియ‌ర్‌` అనే ద్విభాషా చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి, అక్షర గౌడ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. విల‌న్ పాత్రను ఆది పినిశెట్టి చేస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు.

ఇందులో ఆటిట్యూడ్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ అల‌రించ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ భాషల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న ఈ చిత్రం జులై 14న విడుద‌ల కాబోతోంది. ఇక ఈ మూవీ అనంత‌రం రామ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. `RAPO 20` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

ఈ సినిమాను సైతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరినే నిర్మించ‌బోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపుదిద్దు కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. బోయ‌పాటి మూవీ కోసం రామ్ మున్నెప్పుడూ చేయ‌ని స‌రికొత్త ప్ర‌యోగం చేసేందుకు సిద్ధం అయ్యాడు.

ఈ సినిమాలో త‌న‌కు తానే విల‌న్‌గా చేయ‌బోతున్నాడ‌ట‌. రాజకీయ నేపథ్యంలో సాగే ఇద్దరు అన్నదమ్ముల క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కనుంద‌ని.. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. అందులో హీరో పాత్ర ఒక‌టి కాగా.. మ‌రొక‌టి విల‌న్ పాత్ర‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.